Honey Rose: 2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??

హనీ రోజ్ – వీర సింహ రెడ్డి సినిమాలో చేసిన ఈ మళయాళీ ముద్దు గుమ్మా పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాల వినపడుతుంది. వీర సింహ రెడ్డిలో బాలయ్య పక్కన హీరోయిన్ గా చేసిన ఈ హనీ రోజ్ ఈ సినిమాలో అభినయం, అందాల ఆరబోతకు మన తెలుగు వాళ్ళు ఫిదా అయిపోయారు.

సినిమాలోనే కాదు ప్రీ-రిలీజ్ ఈవెంట్, సక్సెస్ పార్టీలో బాలయ్య తో షాంపేన్ షేర్ చేసుకోవడంతో ఈ మలయాలై ముద్దు గుమ్మా అస్సలు ఎవరా అని మనవాళ్ళు అరలు తీయడం స్టార్ చేసారు….

అస్సలు ఈ హనీ రోజ్ ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇంతక ముందు తెలుగు సినిమాలు చేసిందా? చేస్తే అవి ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

1. హనీ రోజ్ – మలయాళం క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది…వీళ్ళ నాన్న పేరు థామస్…అమ్మ పేరు రోజ్…వీళ్లది కేరళలోని తోడుపూజలో.

2. 1991 లో పుట్టిన హనీ రోజ్ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో 14 ఏళ్లకే…యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టింది. 2005 లో బాయ్ ఫ్రెండ్ అనే మలయాళం సినిమా హనీ రోజ్ కి మొదటి సినిమా.

3. 2005 నుండి 2008 మధ్యలో మలయాళం, కన్నడ మరియు తమిళ సినిమాలు కొన్ని సినిమాలు చేసిన అవి అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. కట్ చేస్తే 2008 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ఆలయం’ సినిమా తో తెలుగు సినిమా చేసింది. శివాజీ హీరోగా చేసిన ఈ సినిమా కూడా అంతగా పేరు తెచ్చి పెట్టలేదు.

4. ఆ తరువాత మల్లి మళయాళం లోకి వెళ్లి 2012 లో ‘త్రివేండ్రం లాడ్జి’ అనే సినిమా చేస్తే అది హనీ రోజ్ కి ఒక గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత మలయాళంలో హోటల్ కాలిఫోర్నియా థాంక్ యు, 5 సుందరికల్ మరియు మమ్ముట్టి తో దైవతింటే స్వంతం అనే సినిమాలు చేసింది.

5. మళ్ళీ 2014 లో తెలుగులో వరుణ్ సందేశ్ చేసిన ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో మెరిసింది హనీ రోజ్.

6. మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోస్ ల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయిపోయిన హనీ రోజ్ కి వీర సింహ రెడ్డి తో మళ్ళీ తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది.

7. రెండు తెలుగు సినిమాలు చేస్తే రాణి పేరు వీర సింహ రెడ్డి సినిమాతో వచ్చింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే హనీ రోజ్ కి మరోసారి బాలయ్య పక్కన నటించే అవకాశం వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమాలో హీరోయిన్ గా హనీ రోజ్ కన్ఫర్మ్ అయిపోయింది.

ఇది హిట్ అయితే హనీ రోజ్ కి తెలుగు లో ఇంకా వద్దు అన్న సినిమాలు వస్తాయి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus