కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

మన హీరోలు అంత కొత్త దర్శకులు ఇప్పటి వరకు పని చేయని వాళ్ళతో చేయడానికి ఇష్ట పడుతున్నారు అనిపిస్తుంది… ఎందుకంటే నిన్న కాక మొన్న మన వెంకీ మామ కూడా హిట్ 1 & 2 సినిమాల దర్శకుడు అయినా శైలేష్ కొలనుతో… తన 75వ మైలురాయి సినిమా అనౌన్స్ చేసాడు, ఈ యంగ్ డైరెక్టర్ తో వెంకీ కి ఇది మొదటి సినిమా…!

ఇలా ఈ ఇద్దరే కాదు మన తెలుగు హీరోలు అంత దాదాపు ఒక పది మంది హీరోలు
మొదటి సారి కొత్త దర్శకులతో పని చేస్తున్నారు. చూస్తుంటే అందరు హీరో-డైరెక్టర్లు కాంబినేషన్లు క్రేజీగానే ఉన్నాయి కానీ హిట్ కొడతాయి అంటారా? కొడితే ఎంత పెద్ద హిట్ కొడతాయి అనేది పెద్ద డౌటు…?

ఇంతకీ ఆ కాంబినేషన్లు ఏంటి ఆ హీరోలు ఎవరు? ఆ డైరెక్టర్లు ఎవరు? ఆ సినిమాలు? ఏంటి అనే కదా మీ డౌటు? అవి ఇవే…

1. ఎస్ ఎస్ రాజమౌళి & మహేష్ బాబు

ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన మహేష్ బాబుతో సినిమా ఉంటుంది అని చెప్పిన దగ్గర నుండి ఈ సినిమా మీద రోజుకో న్యూస్…రోజుకో గాసిప్పు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే జక్కన్న మాత్రం మీరు ఇప్పటి వరకు చూడని యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నాం అని అనౌన్స్ చేసాడు తప్ప ఇంకెలాంటి డీటెయిల్స్ చెప్పలేదు…ఇది హిట్ అనే సందేహం లేదు కానీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఊహకు కూడా అందడం లేదు…చూడాలి మరి

2. క్రిష్ & పవన్ కళ్యాణ్

క్రిష్ మంచి కథతో…సాంకేతిక విలువలని వాడుకుని మంచి సినిమా తీయగల నిపుణుడు. ఈ దర్శకుడు ఈ సారి తన పాన్ ఇండియా సబ్జెక్టు కి పవన్ కళ్యాణ్ ని ఎంచుకున్నాడు…ఇక సినిమాకు సంబందించిన చిన్న టీజర్ సినిమా మీద అంచులను పెంచేసింది

3. ప్రభాస్ & ప్రశాంత్ నీల్

కేజీఎఫ్ దర్శకుడ ప్రశాంత్ నీల్ తో మన ప్రభాస్ – అమ్మ బాబోయ్ అస్సలు కాంబినేషన్ పేరు వింటేనే బాక్సఫీస్ కి వణుకు వచ్చి ఉంటది… సాలార్ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి మరి

4. రామ్ చరణ్ & శంకర్

తమిళ దర్శకుడు శంకర్ ఒక తెలుగు హీరోతో సినిమా చేయడం ఇదే మొదటిసారి…ఈ ఇద్దరి కంబినేషన్లో వస్తున్నా ఈ సినిమా బడ్జెట్, సాంగ్స్ మేకింగ్ మీద చాలా హైప్ వచ్చింది మరి సినిమా ఎలా ఉంటాదో ??

5. బాలకృష్ణ & అనిల్ రావిపూడి

వీర సింహ రెడ్డి తరువాత మంచి ఊపు మీద ఉన్న బాలయ్య బాబు ఈ సరి మొదటి సరి అనిల్ రావిపూడి తో జత కడుతున్నాడు…మంచి వినోదంతో పాటు మాస్ అంశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు దర్శకుడు అనిల్

6. విజయ్ దేవేరుకోండ & గౌతమ్ తిన్ననూరి

జెర్సీ దర్శకుడు రామ్ చరణ్ తో సినిమా అని అనౌన్స్ చేసి మొదలు కూడా పెట్టకుండానే అది ఆపేసారు. ఎందుకు ఏమిటి అనే కారణాలు తెలియంది కానీ ఇప్పుడు ఇదే కథ విజాతి దేవేరుకోండతో తీస్తున్నారు అని టాక్. ఈ ఇద్దరిది కూడా మొదటి కాంబినేషన్ కావడంతో అంచనాలు పెరిగాయి… లైగర్ లాగ నిరాశ పెట్టకపోతే చాలు

7. వెంకీ & శైలేష్ కొలను

ఎఫ్2 ఎఫ్౩ తరువాత వెంకీ మామ ఎదో కొత్తగా ట్రై చేద్దామని హిట్ 1 & ౨ దర్శకుడు శైలేష్ తో జత కట్టాడు…చూడాలి మరి వెంకీ 75వ సినిమా హిట్ అవుతుందో లేదో.

8. ప్రభాస్ & నాగ్ అశ్విన్

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ పాన్- ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా మొదలు పెట్టాను అని అనౌన్స్ చేసిన దగ్గర నుండి…ఈ సినిమా మీద అంచనాలు ఎక్కడో ఉన్నాయి

9. జూ ఎన్టీఆర్ & ప్రశాంత్ నీల్

సాలార్ తరువాత…ప్రశాంత్ నీల్ జూ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా కెజిఎఫ్ రేంజ్లో ఉంటుంది టాక్ మరి…

10. బుచ్చి బాబు & రామ్ చరణ్

శంకర్ తో సినిమా తరువాత చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు. ఉప్పెనతో మొదటి సినిమాకి వంద కోట్లు రాబట్టిన బుచ్చి బాబు ఈ సినిమా పాన్-ఇండియా హిట్ మీద కన్నేశాడు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus