‘బిగ్ బాస్ 6′ లో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి భట్ అందరికీ గుర్తుండే ఉంటుంది.’కార్తీక దీపం’ సీరియల్ లో హిమ పాత్ర పోషించిన కీర్తి…. బిగ్ బాస్ కు కంటెస్టెంట్ గా వస్తుందని లాస్ట్ మినిట్ వరకూ ఎవ్వరికీ తెలీదు. పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కీర్తి మంగళూర్ లో పుట్టి పెరిగింది. కన్నడలో 2017లో ‘ఐస్ మహల్’ అనే చిత్రంతో అరంగేట్రం చేసింది. అంతకు ముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత చాలామంది సీరియల్స్ లోకి రమ్మని ప్రోత్సహించారు.
దీంతో ‘మనసిచ్చి చూడు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక కీర్తి భట్ త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆమె పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి పేరు కార్తీక్. ఇతను కూడా నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆగస్టు 20 న కీర్తి- కార్తీక్ ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుక … కీర్తి – కార్తీక్ ల బంధుమిత్రులు, ఫ్రెండ్స్ మధ్య జరిగింది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సైతం ఈ వేడుకలో సందడి చేశారు. కీర్తి- కార్తీక్ ల నిశ్చితార్థం ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఒకసారి చూడండి: