హీరోయిన్ కృతి కర్బందా. పరిచయం అవసరం లేని పేరు..! ‘బోణి’ ‘అలా మొదలైంది’ ‘తీన్ మార్’ ‘మిస్టర్ నూకయ్య’ ‘ఒంగోలు గిత్త’ ‘బ్రూస్ లీ’ ‘ఓం 3D’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా.. సక్సెస్ అందకపోవడంతో స్టార్ కాలేకపోయింది.దీంతో ఈమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. రూటు మార్చి ‘బ్రూస్ లీ’ వంటి సినిమాలో సిస్టర్ రోల్ చేసినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.
తెలుగులో ఈమె నటించిన ఓకే ఒక్క సినిమా హిట్ అయ్యింది..! అదే ‘అలా మొదలైంది’. అందులో కూడా ఈమె హీరోయిన్ గా చేయలేదు. జస్ట్ గెస్ట్ రోల్ అనుకోవాలి అంతే..! ఇక తెలుగులో రాణించపోవడంతో తర్వాత ఈమె బాలీవుడ్ కి చెక్కేసి ‘హౌస్ ఫుల్ 4’ ‘పాగల్ పంటి’ ‘వాన్’ ’14 ఫేర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అవి కూడా ఈమె పెద్దగా కలిసి వచ్చింది అంటూ ఏమీ లేదు.
ఇదిలా ఉండగా.. కృతి కర్బందా (Kriti Kharbanda) కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు ఫుల్ కిత్ సామ్రాట్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లపై ఈ జంట చెట్టాపట్టాలేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన విజువల్స్ ఇప్పటికే తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ జంట సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే అధికారికంగా వీరు ప్రకటించింది లేదు