మహేష్ హీరోయిన్ పెళ్ళికి రెడీ అవుతోంది!

  • November 6, 2017 / 02:59 PM IST

మహేష్ బాబు సరసన “ఒన్ నేనొక్కడినే” చిత్రంతో వెండితెరకు పరిచయమైన కృతిసనన్ ఆ తర్వాత తెలుగులో నాగచైతన్య సరసన “దోచెయ్” చిత్రంలో నటించి ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. హీరోయిన్ గా ఇప్పటివరకూ సరైన హిట్ ఒక్కటి కూడా లేకపోయినా ఎప్పుడు ఏదో విధంగా మీడియాలో హైలైట్ అవుతూ లైమ్ లైట్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే.. మీడియా మాత్రం ఎంతకాలం కృతిసనన్ బరువు మోస్తుంది చెప్పండి. అమ్మడు సన్నగానే ఉన్నప్పటికీ.. ఆమెను జనాలు పట్టించుకోవాలంటే సినిమాలైనా ఉండాలి లేదా ఏదైనా కాంట్రవర్సీలో అయిన ఉండాలి. ఈ రెండు లేకుండా జనాలు ఆమెను ఎలా పట్టించుకొంటారు చెప్పండి.

ఎలాగో సరైన సినిమాలు లేవు, కాంట్రవర్సీలు క్రియేట్ చేసేంత తెలివి కూడా లేకపోవడంతో గత కొన్నాళ్లుగా తాను బాలీవుడ్ సీరియల్ ఆర్టిస్ట్ టర్నడ్ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కొనసాగిస్తున్న లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను తెరమీదకు తీసుకొచ్చింది. రీసెంట్ గా ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిందట అమ్మడు, దాంతో అవాక్కయ్యారట ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా సభ్యులు. మరి అమ్మాయిగారు నిజంగానే త్వరలో పెళ్లి చేసుకోబోతోందా లేక పబ్లిసిటీ కోసమే ఇలా హడావుడి చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus