Kushboo: ఆ రీజన్ వల్లే మీనా భర్త చనిపోయారన్న కుష్బూ!

ప్రముఖ నటి మీనా భర్త మృతి అభిమానులను ఎంతగానో బాధపెట్టిన సంగతి తెలిసిందే. మీనా భర్త విద్యాసాగర్ మరణానికి ఇదే కారణమంటూ వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వస్తుండటంతో అభిమానులు సైతం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీనా భర్త మృతి గురించి కుష్బూ మట్లాడుతూ మీనా భర్త మృతి విషయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని తాను కోరుకుంటున్నానని ఆమె అన్నారు. మూడు నెలల క్రితం విద్యా సాగర్ కు కరోనా సోకటం నిజమేనని కరోనా సోకడం వల్ల విద్యాసాగర్ లంగ్స్ కు హాని జరిగిందని ఆమె అన్నారు.

కరోనా వల్ల విద్యాసాగర్ చనిపోయాడని తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. మనం జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి భయాన్ని కలిగించవద్దని ఆమె కామెంట్లు చేశారు. విద్యాసాగర్ మరణ వార్త తెలిసి గుండె పగిలిందని కుష్బూ వెల్లడించారు. భయంకరమైన వార్తతో రోజు మొదలైందని ఆమె కామెంట్లు చేశారు. ఊపిరితిత్తుల సమస్యతో విద్యాసాగర్ చాలాకాలం నుంచి బాధ పడుతున్నాడని ఆమె కామెంట్లు చేశారు. మరోవైపు మీనా భర్త మృతికి సంబంధించి పావురాల వ్యర్థాలు కారణమని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల గురించి మీనా కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

వైరల్ అవుతున్న వార్తలు మీనా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. మీనా విద్యాసాగర్ లకు 2009 సంవత్సరంలో వివాహం జరిగింది. వీళ్ల పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి కాగా ఈ జంటకు నైనిక అనే కూతురు ఉంది. నైనిక ఇప్పటికే తమిళంలో పలు సినిమాల్లో నటించి సక్సెస్ లను అందుకున్నారు. విద్యాసాగర్ మరణవార్త విని పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలు షాకయ్యారు.

ఊపిరితిత్తుల మార్పిడికి దాతలు దొరికి ఉంటే మీనా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విద్యాసాగర్ మృతి గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus