ఇంతకుమునుపు కనీసం కాలి వేళ్లు సైతం కనబడనీయకుండా నిండు చీరకట్టుతో రోడ్డుమీదకు రావడానికి ఇబ్బందిపడేవారు మన స్త్రీలు. పెరుగుతున్న నాగరీకత పుణ్యమా అని చీర పోయి ప్యాంట్లు మెడ్డీలు వచ్చాయి. నిండుతనం పక్కన పెడితే “పోన్లే కనీసం ఏదో ఒకటి వేసుకొంటున్నారు కదా” అని అనుకొనే స్థాయికి వచ్చేసేరు తమను తాము నవతరం స్త్రీలుగా పేర్కొనే అమ్మాయిలు.
కానీ బాలీవుడ్ తార లిసా హేడన్ మాత్రం ఇంకో నాలుగైదు అడుగులు ముందుకేసి.. ఏకంగా షర్టు లేకుండా కేవలం లోదుస్తులతో తన కుక్కపిల్లతో కలిసి కనీసం చెప్పులు కూడా లేకుండా రోడ్డెక్కింది. అంతటితో ఆగకుండా.. సదరు ఫోటోలను తన సోషల్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది!