లిప్ కిస్ ఇష్టంలేక భారీ సినిమాలు వదులుకున్న మడోనా!

  • July 16, 2018 / 07:16 AM IST

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రతి నటి ఆలోచన ఒకేలా ఉండదు. కొంతమంది ప్రతి ఒక్కటి నటనలో భాగమే అంటారు. మరికొంతమంది తమకి నచ్చిన కథలోనే భాగమవుతారు. రెండో వర్గానికి చెందిన నటి మడోనా సెబాస్టియన్. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మాతృ భాషలోనే వెండితెర ప్రవేశం చేసింది. “ప్రేమమ్” సినిమాలో మూడో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాకి, ఆమె పాత్రకు.. మంచి పేరొచ్చింది. ఆ సినిమా తెలుగు రీమేక్ లోను నటించి తెలుగు వారి మనసు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాలేమీ ఆమె ఒప్పుకోలేదు. తమిళం, మలయాళ చిత్రాలను సైతం పరిమిత సంఖ్యలోనే చేస్తోంది. అందం ఉంది.. అభినయం బాగుంది. మరి సినిమాలు ఎక్కువ చేయలేకపోతోందని అందరికి డౌట్ కలిగింది. ఆ అనుమానాని మడోన్నా క్లియర్ చేసింది.

“మలయాళంతో పాటు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నాను. అయినా నాకు భాషా సమస్య రాలేదు. లిప్ కిస్ సీన్లకు నేను వ్యతిరేఖం.  అటువంటి సీన్లలో నటించేందుకు రెడీగా లేను. అందుకే మూడు పెద్ద చిత్రాలు వదులుకున్నా” అని మడోనా వివరించింది. అలాగే తనకు బిడియం ఎక్కువని, బయటివారితో మాట్లాడేందుకు భయపడుతానని తెలిపింది. తొలిసారి కౌగిలింత సీన్ చేసేందుకు ఏడ్చేశానని మడోనా పేర్కొంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో  చేస్తున్న సినిమాలో తనది ఐదు నిమిషాల పాత్రే అయినా, అది ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus