Maheswari: బుల్లితెర నటి మహేశ్వరి బేబీ బంప్ ఫోటోలు వైరల్.!

  • November 18, 2023 / 03:58 PM IST

సినిమాల్లో నటించే వారికంటే సీరియల్స్ లో నటించే వారికే ఎక్కువ క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే సినిమాల్లో నటించేవారు వారానికి ఒకసారి కనిపిస్తారు. కానీ బుల్లితెర నటీనటులు వారమంతా ఎంటర్టైన్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా వారికి ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే.. బుల్లితెర నటి మహేశ్వరి అందరికీ సుపరిచితమే. ‘పెళ్ళినాటి ప్రమాణాలు’ అనే సీరియల్లో లాస్యగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత వరుస సీరియల్స్ లో నటించే ఛాన్స్ దక్కించుకుని ..

బుల్లితెర స్టార్ అనిపించుకుంది. ప్రస్తుతం ‘జీ’ తెలుగులో ప్రసారమవుతున్న నిండు నూరేళ్లు సీరియల్లో నటిస్తున్న ఈమె యూట్యూబ్లో ఓ ఛానల్ ను కూడా మెయింటైన్ చేస్తుంది.ఇక మహేశ్వరికి పెళ్ళైన సంగతి తెలిసిందే. ఆమె భర్త పేరు శివ నాగ్. వీరికి ఓ పాప కూడా ఉంది. పాప పేరు హరిణి. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. షేర్ చేస్తూ ఉంటుంది మహేశ్వరి. అయితే త్వరలో మహేశ్వరి రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

ఈ విషయాన్ని ఆమె యూట్యూబ్లో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత ఈమె తన సోషల్ మీడియాలో బేబీ లోడింగ్ అంటూ తన బేబీ బంప్ ఫోటోలని కూడా షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక (Maheswari) మహేశ్వరి బేబీ బంప్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus