స్టార్ హీరోల పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ కోలీవుడ్ నటి మరియు ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయిన మీరా మిథున్ గత కొద్ది రోజులుగా అక్కడి స్టార్ల పై వివాదాస్పద కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ త్రిష ఓ సైడ్ క్యారెక్టర్ అంటూ ఘోరమైన కామెంట్లు చేసింది. ‘త్రిషకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఇండస్ట్రీలో తనను తొక్కేయడానికి ట్రై చేసిందని మీరా ఘాటు కామెంట్స్ చేసింది. ఇప్పుడు స్టార్ హీరోలైన సూర్య, విజయ్ లను టార్గెట్ చేసింది ఈ బ్యూటీ.

‘కోలీవుడ్ లో ఎప్పటినుండో పాతుకుపోయి ఉన్న నెపోటిజం (బంధుప్రీతి) వల్లే విజయ్,సూర్య లు స్టార్లుగా ఎదిగారని .. . సొంత ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే శక్తి కూడా వీరికి లేదని… చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంటారని తీవ్ర విమర్శలు చేసింది. మీరా మిథున్ చేసిన ఈ కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయని చెప్పాలి. అక్కడి సినీ ప్రముఖులు సైతం ఈమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

ఈమె కామెంట్స్ కు సూర్య స్పందిస్తూ… ‘తక్కువ స్థాయి వ్యక్తులు చేసే విమర్శలను పట్టించుకుని టైం వేస్ట్ చేసుకోవద్దని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘విలువైన ఆ సమయాన్ని సమాజం కోసం వినియోగించాలి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి థాంక్స్’ అని కూడా తెలిపాడు సూర్య.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus