Meena: ఆ హీరో విషయంలో కుష్బూకి కౌంటర్ ఇచ్చిన మీనా?

  • January 8, 2024 / 12:40 PM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు అందరూ కూడా తమ సినిమా ప్రమోషన్ల నిమిత్తం బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో వెంకటేష్ సైతం ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో ఈ హీరో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా ఈయన ఈటీవీలో ప్రసారమయ్యే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణులు కుష్బూ మీనా కూడా పాల్గొని సందడి చేశారు. అదేవిధంగా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుడిగాలి సుధీర్ మీనా వద్దకు వెళ్లి మిమ్మల్ని తెలుగులో వచ్చిన చంటి సినిమాలో చూడటం చాలా ఆనందంగా ఉంది అనగా హైపర్ ఆది కుష్బూ వద్దకు వెళ్లి మిమ్మల్ని తమిళ చంటి సినిమాలో చూడడం సంతోషంగా అనిపించింది అంటూ మాట్లాడుతారు

వెంటనే మీనా కుష్బూ మిమ్మల్ని ఇద్దరినీ ఇక్కడ చూడడం చాలా చిరాగ్గా ఉంది అంటూ సెటైర్స్ వేశారు. అనంతరం ఈ కార్యక్రమంలోకి వెంకటేష్ రావడంతో మీనా కుష్బూ వెంకటేష్ విషయంలో గొడవపడ్డారు. వెంకటేష్ నా పక్కన కూర్చోవాలి అంటే నా పక్కన కూర్చోవాలని వీరిద్దరు గొడవపడ్డారు నేను వెంకటేష్ తో కలిసి ఎన్నో హిట్ సినిమాలలో నటించాను అంటూ మీనా చెప్పగా

ఆయనతో మొదట నటించింది నేను అంటూ కుష్బూ మాట్లాడుతుంది అందుకే మీ జోడి ఎప్పుడు ఆగిపోయింది అంటూ మీనా కుష్బూకి కౌంటర్ వేసింది. ఇలా వీరిద్దరూ తనకోసం కొట్లాడుతూ ఉండగా వెంకటేష్ ఇద్దరి వైపు చూస్తూ అలా ఉండిపోయారు మొత్తానికి ఈ ప్రోమో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus