వెండితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా అనంతరం వరుస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారక వెలుగుతున్న సమయంలోనే ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మీనా దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది. తన కూతురిని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మీనా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇక మీనా సైతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడిపారు.ఇలా తన జీవితం సంతోషంగా సాగిపోతుందనుకున్న సమయంలోనే తన భర్త అనారోగ్యంతో మరణించారు. మీనా భర్త మరణించడంతో ఎంతో శోకసంద్రంలోకి వెళ్లిపోయిన మీనాని తరచూ నటిమనులు కుష్బూ సంఘవి రంభ వంటి వారు కలిసి ఆమెకు ఎంతో ధైర్యాన్ని నింపడమే కాకుండా తిరిగి తనని మామూలు స్థితికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలోనే మీన ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి రావడమే కాకుండా స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ కి వెళ్లడం, పలు పార్టీలకు అటెండ్ అవ్వడం జరుగుతుంది.ఇకపోతే ఈ మధ్యకాలంలో మీనా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈమె చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలైన విషయం మనకు తెలిసిందే.
ఇందులో నందిని పాత్రలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటించారు.అయితే ఈ పాత్ర పై మీనా స్పందిస్తూ నా డ్రీమ్ క్యారెక్టర్ లో ఐశ్వర్యారాయ్ నటించినందుకు చాలా అసూయగా ఉంది. ఇలా మొదటిసారి తన జీవితంలో ఒక వ్యక్తిపై అసూయ కలిగింది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.