వెండితెర నటిగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో సీనియర్ నటి మీనా ఒకరు. బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ భాష స్టార్ హీరోలు అందరూ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈమె కెరియర్ పరంగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె నైనిక అనే ఒక కుమార్తెకు జన్మనిచ్చారు.
అయితే తన జీవితం చాలా సంతోషంగా ఉందనుకున్న సమయంలోనే తన భర్త విద్యాసాగర్ మరణం ఈమెను చాలా కృంగదీసింది. ఇప్పుడిప్పుడే తన భర్త మరణ వార్త నుంచి బయటపడి తన కూతురు కోసం ఈమె జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి తరుణంలోనే మీన రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇదివరకు ఎన్నోసార్లు మీనా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు యాంకర్ నుంచి కాస్త వెకిలి ప్రశ్నలు ఎదురయ్యాయి తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రశ్నను పదేపదే అడుగుతూ తన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నంలోనే ఆమెను బాగా విసిగించారు. చూడటానికి మీరు చాలా అందంగా ఉంటారు వయసు కూడా తక్కువే కదా మరి రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మీనా తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు. నేను రెండో పెళ్లి చేసుకుంటాను అని ఎక్కడా చెప్పలేదు
అలాగని చేసుకోను అని కూడా చెప్పను రేపు ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు అందుకే నేను ముందుగా పెళ్లి చేసుకుంటాను చేసుకోను సింగిల్ గానే ఉంటాను అనే విషయాల గురించి స్టేట్మెంట్లు ఇవ్వను. కాలం మన జీవితాన్ని ఎటు తీసుకెళ్తే అటు నడవాల్సి ఉంటుందని ఈమె తెలిపారు. ఇక నా ముందు ఉన్న ప్రధాన లక్ష్యం నా పెళ్లి కాదని నా కూతురు భవిష్యత్తు అంటూ ఈ సందర్భంగా మీనా (Meena) చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.