Meera Jasmine: లేటు వయసులో ఘాటు అందాలు.. వైరల్ అవుతున్న మీరా జాస్మిన్ ఫోటోలు!

Ad not loaded.

మీరా జాస్మిన్ గతంలో ఎన్నడూ లేని విధంగా స్లిమ్ అయ్యి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వస్తోంది. ఈమె రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది అని ఈ ఫోటోలతో చెప్పకనే చెప్పింది. ‘అమ్మాయే బాగుంది’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్… అటు తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గుడుంబా శంకర్’ తో బాగా పాపులర్ అయ్యింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి పాత్రల్లో ఈమె ఎక్కువగా కనిపించేది. ఈ క్రమంలో ఆమె చేసిన ‘భద్ర’ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘పందెం కోడి’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ ‘గోరింటాకు’… వంటి సినిమాలు కూడా హిట్ అయ్యాయి.

అయితే ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’ ‘మహారధి’ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇటీవల విమానం సినిమాతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం ఆపలేదు. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus