Nagma: పెళ్లి గురించి హీరోయిన్ నగ్మా షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

  • August 31, 2023 / 03:08 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నగ్మా ఒకరు కాగా తాజాగా ఒక సందర్భంలో నగ్మా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇంతకాలం పెళ్లికి దూరంగా ఉన్న ఈ నటి తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నగ్మా వయస్సు 48 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. పెద్దింటి అల్లుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నగ్మా ఆ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి నటించడంతో పాటు ఈ జనరేషన్ హీరోలలో కొంతమందికి అత్తగా కూడా నటించారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించిన నగ్మా ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవారు. పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదని నగ్మా కామెంట్లు చేశారు. నాకంటూ ఒక తోడు ఉండాలని పిల్లలు ఉండాలని ఆశ అని ఆమె కామెంట్లు చేశారు. పెళ్లి ద్వారా ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవాలని ఉండేదని నగ్మా వెల్లడించారు. కాలం కలిసొస్తే త్వరలో నా పెళ్లి జరుగుతుందేమో చూద్దామని ఆమె కామెంట్లు చేశారు.

నిజంగా పెళ్లి జరిగితే మాత్రం సంతోషంగా ఫీలవుతానని నగ్మా అభిప్రాయం వ్యక్తం చేశారు. సంతోషమనేది లైఫ్ లో కొంతకాలానికే పరిమితం కాదు కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో పలువురితో ప్రేమాయణం ద్వారా నగ్మా వార్తల్లో నిలిచారు. సౌరవ్ గంగూలీ, రవి కిషన్, మనోజ్ తివారిలతో నగ్మా ప్రేమలో పడ్డారని వార్తలు వినిపించాయి.

నగ్మా (Nagma) గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ జనరేషన్ ఫ్యాన్స్ లో కూడా నగ్మాను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో నగ్మా కెరీర్ పరంగా ఇంకా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus