స్టార్ హీరోలే కాదు ‘టైర్ 2’ హీరోలు.. అంటే మీడియం రేంజ్ హీరోలు కూడా తమ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. వీళ్ళ సినిమాలకి కూడా హైప్ ఉంటే స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఓపెనింగ్స్ ని రాబడతాయి.స్టార్ డైరెక్టర్లతో.. అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చెయ్యకపోయినా .. మొదటి రోజు వీళ్ళ సినిమాలకి కూడా మంచి కలెక్షన్లు వస్తుండటం అంటే చిన్న విషయం ఏమీ కాదు. వీళ్ళ సినిమాలకు కూడా డిమాండ్ అలా ఉంటుంది.పరిశ్రమని కాపాడేది మిడ్ రేంజ్ హీరోల సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి అనిపించుకోదు. ఎందుకంటే.. వీళ్ళు ఏడాదికి మూడు సినిమాలు చేస్తారు. ఆ సినిమాల గురించి ఎంతో మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వాళ్లకి వేతనం అందేది వీళ్ళ సినిమాల వల్లే కదా..!
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. స్టార్ హీరోలు చేయలేని ప్రయోగాత్మక చిత్రాలు మిడ్ రేంజ్ హీరోలు చేస్తే ప్రేక్షకులు చూస్తారు. అయితే ప్రయోగాత్మక చిత్రాలు అంటే కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు. ఈ విషయంలోనే మిడ్ రేంజ్ హీరోలు తప్పుగా అలోచించి ఘోరమైన ప్లాపులు మూటగట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కథనం డిమాండ్ చేస్తే యాక్షన్ ఉండాలి. కానీ స్టార్ హీరోల్లానే.. మిడ్ హీరో హీరోలు కూడా యాక్షన్ సినిమాలు చేస్తే బాగోదు కదా. అందుకే ఈ వీళ్ళు చేసిన యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు (Action Movies) ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) లై :
నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించారు ’14 రీల్స్’ వారు.ఇదొక యాక్షన్ మూవీ. థియేట్రికల్ రైట్స్ పరంగా రూ.24 కోట్లు రికవరీ అయ్యాయి. కానీ మిక్స్డ్ టాక్ రావడంతో రూ.14 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.
2) ఇంటిలిజెంట్ :
సాయి ధరమ్ తేజ్ హీరోగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బడ్జెట్ రూ.38 కోట్ల వరకు అయ్యింది. కానీ ఫైనల్ గా రూ.5 కోట్లు మాత్రమే షేర్ ని కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.
3) కృష్ణార్జున యుద్ధం :
నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ దాదాపు రూ.42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో రూ.15 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.
4) మహాసముద్రం :
శర్వానంద్ హీరోగా ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ రూ.45 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. కానీ థియేట్రికల్ బిజినెస్ మాత్రం రూ.17 కోట్ల వరకే జరిగింది. ఇక ప్లాప్ టాక్ రావడంతో రూ.10 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.
5) అమర్ అక్బర్ ఆంటోని :
రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ రూ.45 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. రూ.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ప్లాప్ టాక్ రావడం వల్ల రూ.17 కోట్లు నష్టాలు వచ్చాయి.
6) ది వారియర్ :
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. రూ.40 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ నెగిటివ్ టాక్ వల్ల రూ.19 కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది.
7) గని :
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు నిర్మాతలు. రూ.26 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ప్లాప్ టాక్ రావడంతో ఫైనల్ గా రూ.21 కోట్ల నష్టాలు మిగిల్చింది.
8) లైగర్ :
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ పెట్టారు. రూ.82 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ప్లాప్ టాక్ రావడంతో ఫైనల్ గా రూ. 56 కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది.
9) ఏజెంట్ :
అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ యాక్షన్ సినిమాకు రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టారు. రూ.40 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ప్లాప్ టాక్ వల్ల రూ.28 కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది.
10) కస్టడీ :
నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీకి రూ.58 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. రూ.23 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ టాక్ నెగిటివ్ గా రావడం వల్ల రూ. 16 కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది.