Balayya Babu, Ram: రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

  • August 28, 2023 / 09:46 AM IST

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో కలిసి లేటెస్ట్ గా ‘స్కంద’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తీస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, యంగ్ హీరో ప్రిన్స్ విలన్ గా నటించాడు. ఇక అఖండ సినిమాలో విలన్ రోల్ ద్వారా ప్రేక్షకులను భయపెట్టిన సీనియర్ హీరో శ్రీకాంత్, ఇందులో ఈసారి పూర్తి స్థాయి పాజిటివ్ రోల్ తో మన ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రం సెప్టెంబర్ 15 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాట బాగా వైరల్ అయ్యింది. అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఆ పాట మంచి అంచనాలను ఏర్పాటు చేసింది. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎక్కడి నుండి మొదలు పెట్టి , ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కాలేదు, ఆ స్థాయిలో ఆయన ప్రసంగం ఉంది. ఇక హీరో రామ్ తో ఆయన వ్యవహరించిన తీరు అందరికి చాలా తేడా గా అనిపించింది. రామ్ మాట్లాడుతున్న సమయంలో ‘ఇందాక నువ్వు నా గురించి తినకూడని మాట అన్నావు..అది నా చెవిన పడింది’ అంటూ హిందీ లో కాసేపు రామ్ కి ధమ్కీ ఇస్తూ ‘బా***వ్’ అని తిడుతాడు.

ఈ వీడియో బిట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ‘బాలయ్య గారు కాసేపటి క్రితం నన్ను పాట పాడమని చెప్పారు, వద్దు సార్ అని చెప్పాను’ అని అంటాడు. అప్పుడే బాలయ్య స్కంద సినిమా సెకండ్ హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. బాలయ్య వైపు చూస్తూ రామ్ మాట్లాడేలోపు ‘నేను ఆ అమ్మాయి తో మాట్లాడితే నీకేంటి ఇబ్బంది’ అంటూ సీరియస్ లుక్ ఇస్తూ కోటేటట్టు చూస్తాడు. అప్పుడు రామ్ ‘బాలయ్య గారు మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు, ఇది సాధారణమైన విషయం కాదు’ అంటూ మాట్లాడుతాడు. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus