మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!

సినీ పరిశ్రమలో అవకాశం రావడం అంత ఈజీ మేటర్ కాదు. ఏళ్ళకి ఏళ్ళు నిరీక్షిస్తేనే కానీ అవకాశం దక్కుతుంది అనే గ్యారెంటీ లేదు. ఒకవేళ అవకాశం వచ్చినా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది అని అస్సలు చెప్పలేము. ముందు చిన్న, మిడ్ రేంజ్ హీరోలతో ఒకటి రెండు హిట్లు తీస్తే ఆ తర్వాత స్టార్ హీరోతో సినిమాలు చేసే ఛాన్స్ రావచ్చు. కానీ అదేంటో కానీ కొంతమంది దర్శకులకి ఆరంభంలోనే పెద్ద హీరోలతో పనిచేసే ఛాన్స్ దక్కింది.

కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు ఆ దర్శకులు. స్టార్ హీరోలతో చేసిన సినిమాలను పక్కన పెట్టేసి.. చిన్న మిడ్ రేంజ్ హీరోలతో కూడా సినిమాలు చేసి ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా ఇవ్వలేకపోయారు. ఆ దర్శకులు (Directors) ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) మెహర్ రమేష్ :

ఈ లిస్ట్ లో ముందున్న దర్శకుడు ఇతనే. ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్, చిరంజీవి వంటి స్టార్లతో సినిమాలు చేసినా.. ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ‘బిల్లా’ సినిమా కొంతలో కొంత యావరేజ్ అనిపించుకుంది. ఈ మధ్యనే వచ్చిన ‘భోళా శంకర్’ కూడా ప్లాప్ అయ్యింది.

2) యోగి :

రవితేజ తో ‘ఒక రాజు ఒక రాణి’ , వెంకటేష్ తో ‘చింతకాయల రవి’ , నాగ శౌర్య తో ‘జాదూగాడు’ వంటి సినిమాలు తెరకెక్కించినా ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు.

3) శ్రీరామ్ ఆదిత్య :

‘భలే మంచి రోజు’ తో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న శ్రీరామ్ .. ఆ తర్వాత ‘శమంతకమణి’ అనే సినిమా తీశాడు. అటు తర్వాత నాని – నాగార్జున వంటి స్టార్లతో ‘దేవ దాస్’ అనే సినిమా తీశాడు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ ను ‘హీరో’ తో లాంచ్ చేశాడు. అయినా ఒక్క సక్సెస్ కూడా ఇతని అకౌంట్లో పడలేదు.

4) రమేష్ వర్మ :

రాక్షసుడు అనే డబ్బింగ్ సినిమా అలాగే రైడ్ అనే సినిమా యావరేజ్ రిజల్ట్స్ అందుకున్నాయి. కానీ ఇతను చేసిన ‘ఒక ఊరిలో’ ‘వీర’ ‘ఖిలాడి’ అన్నీ డిజాస్టర్లే..!

5) స్వర్ణ సుబ్బారావు అలియాస్ హర్షవర్ధన్ :

‘విజయేంద్ర వర్మ’ ‘హరే రామ్’ వంటి పెద్ద సినిమాలు చేశాడు కానీ ఒక్క సక్సెస్ కూడా ఇతని ఖాతాలో పడలేదు.

6) మల్లికార్జున్ :

కళ్యాణ్ రామ్ తో ‘అభిమన్యు’ ‘కళ్యాణ్ రామ్ కత్తి’ ‘షేర్’ వంటి సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయినా ఒక్క సక్సెస్ కూడా ఇతని ఖాతాలో పడలేదు.

7) వాసు వర్మ :

నాగ చైతన్య – దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ‘జోష్’ , సునీల్ -దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణాష్టమి’.. రెండూ డిజాస్టర్లే..!

8) వర ముళ్ళపూడి :

ఎన్టీఆర్ తో ‘నా అల్లుడు’ అనే సినిమా చేశాడు. అదే ఇతని మొదటి సినిమా. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత అల్లరి నరేష్ తో ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ అనే సినిమా చేశాడు. అది కూడా డిజాస్టరే.

9) రాధా కృష్ణ కుమార్ :

గోపీచంద్ తో చేసిన ‘జిల్’ యావరేజ్ రిజల్ట్, ప్రభాస్ తో చేసిన ‘రాధే శ్యామ్’ పెద్ద డిజాస్టర్. ఇతని ఖాతాలో కూడా ఇంకా హిట్ పడలేదు.

10) రాధా మోహన్ :

‘ఆకాశమంత’ ‘గగనం’ ‘గౌరవం’.. ఇలా ఇతను మంచి కంటెంట్ తో సినిమాలు తీసినా.. ఎందుకో ఇతని ఖాతాలో కూడా సక్సెస్ పడలేదు.

11) సురేష్ వర్మ :

రాజశేఖర్ తో ‘శివయ్య’, ఎన్టీఆర్ తో ‘సుబ్బు’ వంటి సినిమాలు చేసినా ఇతను సక్సెస్ అందుకోలేకపోయాడు.

12) శ్రీనివాస్ రెడ్డి :

రామ్ తో ‘శివమ్’ అనే పెద్ద సినిమా చేశాడు. ఇది పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత అల్లరి నరేష్ – మోహన్ బాబు లతో ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే క్రేజీ సినిమా తీశాడు. ఈ రెండు సినిమాలు డిజాస్టర్లే..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus