నయనతారనా మజాకా?
- August 25, 2017 / 03:15 PM ISTByFilmy Focus
తెలుగులో నయనతార పని అయిపోయింది అని అనుకున్నారు అందరూ…ఆమె కరియర్ ఎండ్ అయిపోయింది అని గుసగూసలాడుకున్నారు అందరూ…అసలు నయన ఇంకా సినిమాల్లో కనిపించదు అని ఎన్నో మార్లు మాట్లాడారు చాలా మంది….కానీ టాలెంట్ ఉండాలే కానీ…వయసుతో, సక్సెస్ తో సంభంధం లేకుండా దూసుకు వెళ్ళవచ్చు అని నిరూపించింది నయన తార…విషయంలోకి వెళితే….రెండు బడా ఆఫర్లు…క్రేజీ ప్రాజెక్ట్స్ ను తన ఖాతాలో వేసుకుంది నయనతార…ఈ దెబ్బతో అందరికీ ఒక బారీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి…ఇంతకీ ఏంటి ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ అంటే….ముందుగా నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు నయన్ హీరోయిన్ గా ఎంపికైంది.
ఆ చిత్రానికి నయనతారకు రూ.3 కోట్లకు పైగా పారితోషకం ఇచ్చి మరీ ఓకే చేయించుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘సైరా’లోనూ నయన్ అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ మరింత ఎక్కువ కావడంతో పారితోషకం కూడా అందుకు తగ్గట్లుగానే తీసుకుంటోందట. చిరు సరసన కథానాయికగా చాలామంది పేర్లను పరిశీలించి.. చివరికి నయనతారను మించిన ఛాయిస్ లేదని ఆమెకే ఓటేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి ఆమె రూ.3.5 కోట్లకు పైగా పారితోషకం తీసుకోబోతున్నట్లు సమాచారం. అంటే మొత్తం కలిపి అక్షరాల 6.5 లక్షలు అన్న మాట…అదీ మరి నయనతార రేంజ్…ఇప్పటికైనా…ఒప్పుకుంటారా…నయనతార రేంజ్ ఏంటో!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











