సెలబ్రిటీలకు మీడియా, సోషల్ మీడియా అనేవి రెండు కళ్లలాంటివని చెప్పొచ్చు. ఒకటి ప్రొఫెషనల్‌గా ఉపయోగా పడితే, మరొకటి పర్సనల్‌గా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి దగ్గర చేస్తుంది. సినిమాలో ఏడాదికో, ఆర్నెల్లకో ఓసారి కనిపిస్తే.. సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లకు ఎప్పుడూ టచ్‌లో ఉండొచ్చు. ఈ విషయంలో హీరోయిన్లు మాత్రం సూపర్ స్పీడ్‌గా ఉంటారు. ఒకోసారి వాళ్ల పబ్లిసిటీ కోసం నెటిజన్లకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చే వాళ్లు కూడా ఉన్నారు. ఇంలాంటి పనితోనే ఇప్పుడు ఓ హీరోయిన్ వార్తల్లో నిలిచింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నికీషా పటేల్ తెలుసు కదా?.. రీసెంట్గా ఆమె షేర్ చేసిన ఓ పిక్ ఆధారంగా నికీషా పటేల్ పెళ్లి గురించి, కాబోయే ఫియాన్సీ గురించి రకరకాల వార్తలు దర్శనమిచ్చాయి. నికీషా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో నెటిజన్లతో చేసిన చిట్ చాట్‌లో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పగా.. అందరూ మీ ఫియాన్సీని చూపించండి అని అడగడంతో.. దివాళీ విషెస్ చెబుతూ ఆమె కాబోయే భర్తను రివీల్ చేసిందని.. కొంతకాలంగా ఓ ఫారినర్‌తో లవ్‌లో ఉందని వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే.. ఆ వార్తలు అవాస్తవం అంటూ షాక్ ఇచ్చింది. అలాగే తన పోస్ట్ కూడా డిలీట్ చేసింది. ఇది ఫాల్స్ న్యూస్ అంటూ తన మ్యారేజ్ గురించి పలు వెబ్ సైట్స్ రాసిన న్యూస్ ఆర్టికల్స్ స్క్రీన్‌షాట్స్‌ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. పవన్ సినిమాతో ఇంట్రడక్షన్ ఇవ్వడంతో తన పేరు అందరికీ తెలిసింది కానీ సినిమా రిజల్ట్ కారణంగా తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. తర్వాత తమిళ్ లో బిజీ అయింది.
’కొమరం పులి’ వచ్చిన మూడేళ్లకి కళ్యాణ్ రామ్ ‘ఓం 3డి’ లో కనిపించింది. చానాళ్లకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా వచ్చిన ‘అరకు రోడ్ లో’ అనే సినిమాలో నటించింది. తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో తెలుగులో ఫేడవుట్ అయిపోయింది. దీంతో జనాలకు, ఇండస్ట్రీ వర్గాల వారికి నేనున్నాను అంటూ హింట్ ఇవ్వడానికే పెళ్లి అనేది ఆమె చేసిన పబ్లిసిటీ స్టంట్ ఏనా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.