వరుణ్ సందేశ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిషా అగర్వాల్. ఆ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది. అటు తర్వాత ‘సోలో’ ‘సుకుమారుడు’ ‘సరదాగా అమ్మాయితో’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది. ఇందులో ‘సోలో’ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఈమెకు మంచి నటి అనే పేరు తెచ్చిపెట్టింది. కానీ అక్కలా స్టార్ హీరోయిన్ అవ్వలేకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి..
2013 డిసెంబర్ లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కరణ్ ను (Nisha Agarwal) ఈమె వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈమెకు ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈమె మళ్ళీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం గ్లామర్ ఫోటో షూట్ లో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ప్రొడక్షన్ హౌస్ లకు కూడా పంపిస్తున్నట్టు వినికిడి. నిషా అగర్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :