కాజల్ అగర్వాల్ చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ నిషా అగర్వాల్.సంపత్ నంది దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘సోలో’ ‘సుకుమారుడు’ ‘సరదాగా అమ్మాయితో’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.కానీ తన అక్క కాజల్ రేంజ్లో ఈమె సక్సెస్ కాలేకపోయింది. ‘సోలో’ తప్ప మరే మూవీ కూడా ఈమెకు కలిసిరాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి..
పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది ఈ అమ్మడు. కాజల్ కంటే ముందే ఈమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2013 డిసెంబర్ లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కరణ్ ను ఈమె వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు.మొన్నామధ్య ఈమె తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందంటూ ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె నెటిజన్లతో చివాట్లు తినే పనొకటి చేసింది.
‘ఈ రక్షా బంధన్ నాకు చాలా స్పెషల్. ఈసారి నేను నా బ్రదర్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను.’ అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో తప్పేముంది అని మీకు అనిపించవచ్చు. కానీ నిషా అగర్వాల్ రాఖీ కట్టింది కాజల్ భర్త గౌతమ్ కిచ్లుకి కావడం షాకిచ్చే అంశం. ‘బ్రదర్ ఇన్ లా’ అనడం నాకు ఇష్టం లేదు అంటూ ఈమె ఓ కామెంట్ కూడా పెట్టింది.
‘కాజల్ కి భర్త అయినప్పుడు.. నీకు ఏమవుతాడో ఆ మాత్రం అర్థం కావడం లేదా?’, చెత్త వరసలు మీరు’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. నిషా అగర్వాల్, గౌతమ్ కిచ్లు ల రాఖీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?