నటనకి వయసు, డబ్బుతో సంబంధం లేదు. ప్యాషన్, కష్టపడే మనస్తత్వం ఉండాలని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు చెప్పే మాట. కానీ డబ్బు అనేది కచ్చితంగా ఉండాలనేది బహిరంగ రహస్యమే. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ది లెజెండ్’ అనే చిత్రంతో 51 ఏళ్ళ వయసులో హీరోగా పరిచయమవుతున్నాడు లెజెండ్ శరవణన్. ఈ మూవీ మల్టీ లాంగ్వెంజెస్ లో భారీ పాన్-ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఊర్వశి రౌటేలా హీరోయిన్. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు ఈ చిత్రంలో నటించారు. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ‘శ్రీ లక్ష్మీ మూవీస్’ సంస్థ పై తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం హీరో పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
‘మీ అందరూ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ఒక కామన్ మాన్ ఎలా లెజెండ్ గా ఎదిగాడు? అతని ప్రయాణం లో ఎలాంటి సవాల్ ను అధిగమించాడనేది ‘ది లెజెండ్’ లో అద్భుతంగా చూపించాం. ఇది చాలా భారీ చిత్రం. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేశారు. జూలై 28న మీరంతా చూసి ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలి.నటనకి వయసు అనేది అడ్డురాదు అనే ఉద్దేశంతో నటుడిగా మారాను’ అంటూ ఈయన ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతుంటే ఎంత ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే 51 ఏళ్ళ వయసులో హీరోగా నటిస్తుంటే.. ఇంత భారీ క్యాస్ట్ అండ్ క్రూ ఎలా పనిచేసారు అనే డౌట్ జనాల్లో ఉంది. అసలు ఈ హీరో ఎవరు అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) తమిళనాడులో శరవణ స్టోర్స్.. అంటే తెలియని వారంటూ ఉండరు. టెక్స్ట్ టైల్స్ , జ్యువెలరీ స్టోర్స్ తో పాటు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నగలు వంటివి అన్నీ ఈ శరవణ స్టోర్స్ లో లభిస్తాయి.
2) దీన్ని స్థాపించిన వారిలో ఒకరైన శరవణన్ సెల్వ రత్నమ్ కొడుకే ఈ ఆరుళ్ శరవణన్.
3) 1970వ సంవత్సరంలో చెన్నైలో అరుళ్ శరవణన్ జన్మించారు.చదువు పూర్తయిన వెంటనే తన తండ్రిలానే శరవణన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.
4) మొదట్లో ఈయన క్లోతింగ్, ఫర్నిచర్, జ్యువెలరీ వంటి వ్యాపారాలను చూసుకున్నారు. వందల కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపారాలు ఇవి.
5) అరుళ్ కేవలం బిజినెస్మెన్ మాత్రమే కాదు, మోడల్ కూడా. తన ‘శరవణ స్టోర్స్’ కు తనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
6) తమన్నా, హన్సిక వంటి స్టార్ హీరోయిన్లతో 2019లో శరవణ్ రూపొందించిన ప్రచార చిత్రాలు ఓ రేంజ్లో హాట్ టాపిక్ అయ్యాయి.
7) చిన్నప్పటి నుండి ఇతనికి నటుడవ్వాలి అనే కోరిక కూడా ఉంది. కానీ అందుకు చాలా కారణాలు అడ్డుపడ్డాయి. మోడల్ గా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడంతో నటుడిగా కూడా మారాలని డెసైట్ అయ్యాడు అరుళ్.
8) అలా అని ఇతను డబ్బులు జల్లేసి సినిమా మొదలుపెట్టలేదు. మొదట చెన్నైలో ఉన్న ‘అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో’ యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత ‘ది లెజెండ్ శరవణ స్టోర్స్ కంపెనీ’ బ్యానర్ పై ‘ది లెజెండ్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
9) కె.డి.-జెర్రీ ఈ చిత్రానికి దర్శకులు.గతంలో వీరు అజిత్ తో ‘ఉల్లాసం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. మార్చి 9, 2022న ‘ది లెజెండ్’ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శరవణన్ సైంటిస్ట్ గా కనిపించనున్నారు. ఊర్వశి రౌటెల హీరోయిన్.
10) శరవణన్ కు సూర్య శ్రీ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 2017 జూన్ లో సోదరి వివాహం సందర్భంగా రూ.15 కోట్ల విలువైన దుస్తులు అరుళ్ బహూకరించాడు. ఈ న్యూస్ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది.