Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nivetha Pethuraj: నివేదా పేతురాజ్‌ హర్ట్‌ అయ్యింది… కేసు కూడా పెడతానంటోంది!

Nivetha Pethuraj: నివేదా పేతురాజ్‌ హర్ట్‌ అయ్యింది… కేసు కూడా పెడతానంటోంది!

  • March 6, 2024 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nivetha Pethuraj: నివేదా పేతురాజ్‌ హర్ట్‌ అయ్యింది… కేసు కూడా పెడతానంటోంది!

హీరోయిన్ల మీద నోరేసుకొని పడిపోవడం.. వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి ట్రోలింగ్‌లు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఏదో అన్నీ తమకే తెలిసినట్లు కొందరు రాజకీయ నాయకులు కూడా కామెంట్లు చేస్తుంటారు. ఇటీవల త్రిష(Trisha) విషయంలో ఇలానే కామెంట్లు చేసి నాలుక కరుచుకున్న ఓ రాజకీయ నాయకుడిని చూశాం. ఇప్పుడు నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj) మీద కూడా ఇలాంటి కామెంట్సే వినిపించాయి. ఆ మాటలతో నొచ్చుకున్న నివేదా ఏకంగా పోలీసుకు కేసు పెడతాను అని వార్నింగ్‌ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే…

తమిళ, తెలుగు భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది నివేథా పెతురాజ్. అయితే ఆమె గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. కొన్ని తమిళ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వస్తున్న పరువు నష్టం కథనాలు దుమారం రేపుతున్నాయి. నివేదా పేతురాజ్‌కు.. తమిళ హీరో, నిర్మాత, రాజకీయ నేత ఉదయనిధి స్టాలిన్‌కు (Udhayanidhi Stalin) సంబంధం ఉందని ఆ వార్తల సారాంశం.

నివేదాకు దుబాయ్‌లో రూ.50 కోట్లతో ఒక ఖరీదైన ఇంటిని ఉదయనిధి కొనిచ్చినట్లు ఓ నాయకుడు వ్యాఖ్యానించాడు. ఆమె రెండు నెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి వెళ్తుంటుందని.. అప్పుడు ఉదయనిధి ఆమెను కలుస్తాడని ఆ వ్యక్తి కామెంట్స్‌ చేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో నివేదా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. తాను లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు, తనకు ఎవరెవరో ఏదేదో ఇచ్చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణల గురించి అందులో ప్రస్తావించింది.

గౌరవప్రదమైన కుటుంబం నుండి తాను వచ్చానని, 16వ ఏట నుండే ఇండిపెండెంట్‌గా బతుకుతున్నాని, తన సంపాదన మీదే తన జీవితం గడుస్తోందని నివేదా చెప్పింది. తన కుటుంబం 20 ఏళ్లుగా దుబాయిలోనే ఉంటోందని.. అక్కడ తామున్నది అద్దె ఇంట్లో అని క్లారిటీ ఇచ్చింది. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన మీద ఆరోపణలు చేసిన వారి మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పింది.

అయితే ఇప్పటికీ మానవత్వం మిగిలి ఉందని నమ్ముతూ తాను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నానని చెప్పారు. దీంతో ఇకనైనా తన గురించి ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని కోరింది. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nivetha
  • #Nivetha Pethuraj

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

5 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

9 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

20 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

21 hours ago
Hridayam – Hrudhayam Murali: కల్ట్‌ క్లాసిక్‌ ‘హృదయం’.. కొత్త ‘హృదయం మురళి’ మధ్య కామన్‌ పాయింట్‌ ఇదే..

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version