యూట్యూబ్ ఛానళ్ళ పై కేసు పెట్టిన పూనమ్ కౌర్ ..!

పూనమ్ కౌర్ ఈవిడ ఒకప్పుడు హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలీదు. శ్రీకాంత్ సరసన ‘మాయాజాలం’ అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ‘వినాయకుడు’ ‘నాగవల్లి’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘నెక్స్ట్ ఏంటి’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. కానీ ఈ అమ్మడు రూమర్స్ తోనే బాగా పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఈమె బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరును కూడా ఇరికించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్నికలకి ముందు తన పై ఎన్ని రూమర్లు వచ్చినా పట్టించుకోని పూనమ్ ఎన్నికల అనంతరం సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది.

‘నా పేరును ప్రస్తావిస్తూ కొన్ని లేని పోని ప్రచారాలు చేస్తున్నారని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు నన్ను మానసికంగా కూడా వేధిస్తున్నారు. వారి పై తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కంప్లైంట్ ఫైల్ చేసింది. పవన్ పై నెగిటివ్ కామెంట్స్ చేయకపోయినా ఎదో రకంగా పవన్ పేరుని తీసుకొస్తూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసి పూనమ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో కూడా పవన్ గురించి ఆమె ఫోన్ లో మాట్లాడుతున్నట్టు ఉండే ఓ ఆడియో ఫైల్ ను కూడా క్రియేట్ చేసి కొందరు దానిని వైరల్ చేసారు. ఆ వీడియో ఫెక్ అని తెలిసినా పూనమ్ దానికి క్లారిటీ ఇవ్వలేదు. పవన్ – పూనమ్ ల కొందరు కామెంట్లు చేస్తున్నప్పుడు కూడా ఆమె పట్టించుకోలేదు. అయితే అప్పుడెప్పుడో వచ్చిన ఈ వార్తలను అందరూ మర్చిపోయారు. అయితే ఇప్పుడు కేసు వేయడం ఏంటో అర్ధం కాని సంగతి. ఏకంగా 50 యూ ట్యూబ్ ఛానెళ్ళ పై కేసు పెటింది పూనమ్. అసలు ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకుంటారా అనేది కూడా అనుమానమనే చెప్పాలి మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus