Poorna: తనే నా ప్రపంచం… ఎమోషనల్ వీడియో షేర్ చేసిన పూర్ణ!

  • April 10, 2023 / 06:43 PM IST

సినీ నటి పూర్ణ పలు తెలుగు సినిమాలలో నటించి పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు కూడా ఈమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న పూర్ణ పెళ్లైన కొంతకాలానికి ప్రెగ్నెంట్ అనే శుభవార్తను కూడా అందరితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో పాటు తన బేబీ బంప్ ఫోటోలను కూడా ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు.

ఇకపోతే ఏప్రిల్ 4వ తేదీ ఈమె తన కుమారుడిని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తను తల్లినీ అయ్యానని, మగ బిడ్డ జన్మించారనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ విధంగా పూర్ణ తల్లి కావడంతో ఎంతో మంది అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే తాజాగా పూర్ణ సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డెలివరీ రోజున ఆపరేషన్ థియేటర్ నుంచి తనని రూమ్ కి షిఫ్ట్ చేస్తున్నటువంటి వీడియోని ఈమె షేర్ చేశారు. అయితే ఈమె గది మొత్తం ఎంతో అందంగా అలంకరించి గోడకు బేబీ బాయ్ అని రాసి ఉంది. ఈ వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని షేర్ చేసిన పూర్ణ.. నా జీవితంలో ఇది ఊహకు అందని అనుభూతి…

మా అమ్మ (Poorna) అంటే నాకు చాలా ఇష్టం తనే నా ప్రపంచం… ఇప్పుడు నేను మరొకరికి తల్లిని అయ్యాను. ప్రస్తుతం నేను ఒక పరిపూర్ణ స్త్రీగా మారాననీ రాసు కొచ్చారు. ఇందుకు సంబంధించిన ఈ పోస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటిజన్స్ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus