National Awards: నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

  • March 25, 2023 / 05:26 PM IST

(National Awards)అవార్డ్స్.. నటీనటుల ప్రతిభకు లభించే ప్రోత్సాహం.. వాటికంటే ప్రేక్షకాభిమానుల ప్రశంసలే ఎక్కువ అనుకుంటారు కానీ అవే ఆర్టిస్టులుగా వాళ్లని మరో మెట్టుఎక్కిస్తూ.. ఇంకా బాగా వర్క్ చేయడానికి మంచి బూస్టప్ ఇచ్చేవి అవార్డులు.. వాటిలో జాతీయ అవార్డులకుండే ప్రాధాన్యత గురించి చెప్పక్కర్లేదు.. ఇక హీరోయిన్లకు నేషనల్ అవార్డ్ వస్తే ఆ ఆనందమే వేరు.. సౌత్ నుండి నార్త్ వరకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 10 మంది కథానాయికలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) టబు

హైదరాబాద్‌లో పుట్టి పెరిగి.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొంది.. నార్త్‌లోనూ చక్రం తిప్పిన టబు.. ‘మాచీస్’ (1997), ‘చాందిని బార్’ (2003) వంటి హిందీ చిత్రాలతో రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు..

2) విజయశాంతి

లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి అప్పట్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.. ‘కర్తవ్యం’ సినిమాలోని అద్భుతమైన నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారామె..

3) సుహాసిని

కె. బాల చందర్ దర్శకత్వం వహించగా.. తమిళ స్టార్ సూర్య తండ్రి ప్రధాన పాత్రలో నటించిన ‘సింధు భైరవి’ అనే తమిళ చిత్రంలోని పర్ఫార్మెన్స్‌కి సుహాసినిని నేషనల్ అవార్డ్ వరించింది..

4) ప్రియాంక చోప్రా

మధూర్ భండార్కర్ తెరకెక్కించిన ‘ఫ్యాషన్’ మూవీకి ప్రియాంక చోప్రా నేషనల్ అవార్డ్ తెచ్చుకుంది..

5) ప్రియమణి

తమిళంలో సూర్య తమ్ముడు కార్తి హీరోగా పరిచయమైన ‘పరుత్తి వీరన్’ తోనే ప్రియమణి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఫస్ట్ ఫిలింకే తన నేచురల్ యాక్టింగ్‌తో నేషనల్ అవార్డ్ వచ్చింది..

6) విద్యా బాలన్

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ విద్యా బాలన్.. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ‘ది డర్టీ పిక్చర్’ మూవీకి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్నారు..

7) మీరా జాస్మిన్

మలయాళీ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్‌కి ‘పాదమ్ ఒన్ను ఓరు విలాపమ్’ అనే మలయాళం మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చింది..

8) కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏకంగా నాలుగు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు.. ‘ఫ్యాషన్’ (బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్), బెస్ట్ యాక్ట్రెస్ : ‘క్వీన్’ (2014),, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ (2015), ‘మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019)’..

9) కీర్తి సురేష్

మలయాళీ భామ కీర్తి సురేష్ తెలుగులో కథానాయికగా నటిస్తున్న సమయంలో చేసిన.. మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ తన కెరీర్‌ని కీలకమలుపు తిప్పడమే కాక.. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టింది..

10) అపర్ణ బాలమురళి

సుధ కొంగర తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ లో విలక్షణ నటుడు సూర్య భార్యగా తన సహజమైన నటనతో ఆకట్టుకున్న అపర్ణ బాలమురళి నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus