Rashmika: ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!

రష్మిక మందన … కన్నడ బ్యూటీ అయినప్పటికీ.. తక్కువ టైంలోనే తెలుగులో కూడా పాపులర్ అయిపోయింది. ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అందుకుంది. అటు తర్వాత ‘గీత గోవిందం’ చిత్రం ఈమెకు గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ ను తెచ్చిపెట్టింది. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప'(ది రైజ్) వంటి చిత్రాలు ఈమెను స్టార్ హీరోయిన్ ను చేశాయి. ‘పుష్ప’ తర్వాత ఈమె నేషనల్ క్రష్ గా మారిపోయింది.

బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ తో పాటు నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టులో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే రెయిన్ బో అనే ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తుంది. తన 5 ఏళ్ళ సినీ ప్రయాణంలో రష్మిక సక్సెస్ లతో పాటు ఎన్నో కాంట్రోవర్సీలు కూడా ఫేస్ చేసింది. రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం. విజయ్ దేవరకొండతో ప్రేమాయణం వంటి వార్తలను బేస్ చేసుకుని ఈమె పై చాలా ట్రోలింగ్ జరిగింది.

కానీ రష్మిక (Rashmika) లో గొప్పతనం ఏంటి అంటే.. వాటిని ఈమె పట్టించుకోదు. లెక్కచేయదు. ఎలాంటి సందర్భంలో అయినా సరే ఈమె హుషారుగానే కనిపిస్తుంది. ఇక 1996 ఏప్రిల్ 5న జన్మించిన రష్మిక ఈరోజుతో 27 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సెలబ్రిటీల నుండి అలాగే అభిమానుల నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఈ క్రమంలో రష్మిక కి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus