అఖండ సినిమాతో ప్రముఖ నటి పూర్ణ భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అఖండ సినిమాలో పూర్ణ పాత్ర చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు పూర్ణ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అఖండ సక్సెస్ తో పూర్ణకు సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. శ్రీ మహాలక్ష్మి సినిమాతో పూర్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సీమ టపాకాయ్, అవును సినిమాలు పూర్ణకు మంచి పేరు, గుర్తింపును తెచ్చిపెట్టాయి.
తాజాగా అలీతో సరదాగా ప్రోమో రీలీజ్ కాగా శ్రీకాంత్ తో కలిసి పూర్ణ ఈ షోలో సందడి చేశారు. అవును సినిమా చేసిన సమయంలో తనకు భయం వేయలేదని ఎంతో సరదాగానే షూటింగ్ ను పూర్తి చేశానని పూర్ణ తెలిపారు. అయితే సినిమా రిలీజైన తర్వాత ఆ సినిమాను చూసి తాను రెండు నెలల పాటు నిద్రపోలేదని పూర్ణ వెల్లడించారు. చీకటి పడితే భయంగా అనిపించేదని స్నానం చేసే సమయంలో కూడా తాను కంగారు పడేదానినని పూర్ణ తెలిపారు.
పక్కన ఎవరైనా కూర్చున్నారా? అని తనకు భయం వేసేదని పూర్ణ కామెంట్లు చేశారు. సినిమాలపై తాను ఎక్కువగా దృష్టి పెట్టలేదని పూర్ణ అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలకు ఎస్ చెప్పాల్సి వచ్చిందని అయితే తాను చాలాసార్లు నో చెప్పానని పూర్ణ వెల్లడించారు. అలా చెప్పాను కాబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నానని పూర్ణ పేర్కొన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ఒక డ్యాన్స్ మూమెంట్ చేసే సమయంలో దర్శకుడు తనను ఇబ్బంది పెడితే సెట్ నుంచి బయటకు వెళ్లానని తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!