సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!

గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతూ వచ్చిన టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈరోజు సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన మరణానికి చింతిస్తూ టాలీవుడ్ ప్రముఖులు కొంతమంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సీతారామ శాస్త్రి గారి పాటల్లో ప్రాసలు మాత్రమే కాదు… అందరిలోనూ చైతన్యాన్నినింపే భావాలు కూడా ఉంటాయి. ఈయన పాటలు వింటే ఏ స్టూడెంట్ కు అయినా తెలుగులో నూటికి.. తొంబై మార్కులు వచ్చేస్తాయి అనడంలో కూడా అతిశయోక్తి కాదు. సరే సిరివెన్నెల గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓ లుక్కేద్దాం రండి :

1)సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి.ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాకి చెందిన అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన ఈయన జన్మించారు.

2) ఈయన తండ్రి పేరు శ్రీ డా.సి.వి.యోగి,తల్లి పేరు శ్రీమతి సుబ్బలక్ష్మి.సిరివెన్నెల గారు బ్రాహ్మణ కుటుంబానికి వారు.

3)1984 వ సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు.

4)అయితే కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ చిత్రంతో ఈయనకి మంచి గుర్తింపు దక్కింది.ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్టే. అందుకే ఆ సినిమా పేరే సీతారామశాస్త్రి గారి ఇంటిపేరుగా మారిపోయింది.

5)ఈయన్ని కె.విశ్వనాథ్ గారు ప్రేమగా సీతారాముడు అని పిలుస్తుంటారు.

6)అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అలాగే ఆయన శిష్యుడు కృష్ణవంశీ, కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు సిరివెన్నెల గారితో ఒక్క పాటైనా లేకపోతే సినిమాలు చేసేవారు కాదు.

7) 2019లో సీతారామ శాస్త్రి గారికి ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది.

8)సిరివెన్నెల గారి కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు.. 4 ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు.

9) మొత్తంగా ఆయన 300 కి పైగా సినిమాలకి గేయ రచయితగా పనిచేసారు.

10) ‘గాయం’ ‘మనసంతా నువ్వే’ వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు.

11) ఇటీవల కాలంలో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ ‘రెడ్’ ‘నారప్ప’, ‘కొండపొలం’ ‘వరుడు కావలెను’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి.

12) ‘ఆర్.ఆర్.ఆర్’లో దోస్తీ పాట రాసింది కూడా సిరివెన్నెల గారే.!

13) ఆయన పాటలు రాసిన ‘శ్యామ్ సింగరాయ్’ ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

14) సిరివెన్నెల గారి భార్య పేరు పద్మావతి.ఈ దంపతులకి ఇద్దరు కుమారులు. యోగేశ్వర్ శర్మ పెద్దబ్బాయి. రాజా చిన్నబ్బాయి.

15)వీరి చిన్నబ్బాయి రాజా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. ‘ఎవడు’ ‘ఫిదా’ ‘అజ్ఞాతవాసి’ ‘వి’ మొదలగు సినిమాల్లో నటించాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus