విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా ‘ఎఫ్ 2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. మే 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను సాధిస్తూ దూసుకుపోతుంది. దీంతో సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్.
ఈ వేడుకలో ‘ఎఫ్3’ టీమ్ అంతా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో ‘ఎఫ్3’ లో హీరోలకి అత్త పాత్రలో నటించిన ప్రగతి మైక్ అందుకొని కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను మంచి పాత్రల చేయాలని నటిగా కొనసాగుతున్నాను. కొన్ని మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగ్గ పాత్రలు ఇంకా పడలేదే అన్న వెలితి ఉండేది. అలాంటి టైములో నాకు ‘F2’ రూపంలో బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు.
ఇలాంటి ఒక అవకాశం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. టీ కాఫీ సప్లై క్యారెక్టర్ల నుండీ విలన్ పక్కన నిల్చోవడం, అందమైన అమ్మ..ఇలా సెట్ ప్రాపర్టీలా ఎన్నో సినిమాలు చేశాను. ఇలాంటివి కాదు నేను చేయాల్సింది అని తెలిసినా కూడా.. సరైన అవకాశం వస్తుందనే నమ్మకంతో నేను ఎదురుచూస్తూ వస్తున్నాను. ఇన్నాళ్టికి నా నమ్మకం నిజమైంది.
నాకు అమ్మ లేరు.. నాన్న లేరు.. చుట్టాలు లేరు.. ఎవరు లేరు..! కానీ ఈ సినిమా వల్ల నాకు ఇద్దరు అమ్మలు(అన్నపూర్ణ, విజయ) దొరికారు.వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళంటే నాక్కూడా చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారు ప్రగతి.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!