‘బిగ్ బాస్ రియాలిటీ షోకు వెళ్ళే సెలబ్రిటీలు రెండు కారణాలతోనే వెళ్తారు… ఒకటి పేరు కోసం.. రెండోది ఇప్పటివరకు వారి పై జనాల్లో ఉన్న నెగిటివ్ ఒపీనియన్ ను మార్చుకోవడం కోసం. నాకు ఆ అవసరం లేదు కాబట్టి.. నేను ‘బిగ్ బాస్’ కు వెళ్ళను’ అంటూ నటి ప్రగతి గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మరోసారి ఆమెకు ‘బిగ్ బాస్’ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సమాధానం ఇస్తూ..” ‘బిగ్ బాస్ సీజన్ 1 అండ్ 2 కి నన్ను అడిగారు. కానీ నేను ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాను.
నేను బిగ్ బాస్ కు అంత టైం ఇవ్వలేను. నాకు మామూలుగానే పిచ్చి. అక్కడికి వెళ్ళాను అంటే.. అది ఇంకా ఎక్కువైపోతుందని నాకు భయం.ఓసారి ఇలా ‘బిగ్ బాస్’ ఆఫర్ వచ్చిందని నా కూతురికి చెబితే.. ‘నువ్వు కనుక ఆ షోకి వెళితే నేను నిన్ను జన్మలో క్షమించను, కలవను’… అంటూ వార్నింగ్ ఇచ్చింది. నేను ఇంకా బిగ్ బాస్ వాళ్లకి ఏ డెసిషన్ చెప్పలేదు అని ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు.
పైగా నాకు నిజజీవితంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటేనే నాకు ఇంకా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళి ‘బిగ్ బాస్’ చెప్పింది చెయ్యాలి అంటే నా వల్ల కాదు. అయితే ‘బిగ్ బాస్’ మొదలయ్యే టైం దగ్గరకు వచ్చిన ప్రతీసారి నా ఫోటో వేస్తారు. ‘ప్రగతి ఈ సీజన్ కు వెళ్తుంది’ అని, వాళ్ళ కోసం చెబుతున్నాను నేను ‘బిగ్ బాస్’ కు వెళ్ళే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో అలాంటి వార్తలు వచ్చినా నమ్మకండి” అంటూ స్పష్టం చేసింది ప్రగతి.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!