ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?

  • May 12, 2021 / 01:50 PM IST

ఈ మధ్యనే మన ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా వచ్చింది. కౌశిక్ పెగళ్ళపాటి అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ‘జిఎ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. ఓటిటిలో బాగానే చూసారు జనాలు. అయితే ఆ తరువాత సోషల్ మీడియాలో ఓ విషయం గురించి డిస్కషన్ మొదలైంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి భర్తను చనిపోయినట్టు చూపించారు. అతని పాత్ర సినిమాలో కనిపించదు. ఫ్లాష్ బ్యాక్ లాంటిది కూడా పెట్టలేదు. ‘సినిమాలో ఈ క్లారిటీ మిస్ అయ్యింది.. అందుకే థియేటర్లలో పెద్దగా ఆడలేదు’ అనే కామెంట్స్ వినిపించాయి. అయితే గతంలో వచ్చిన హిట్టు సినిమాల్లో కూడా కనిపించని పాత్రలు ఉన్నాయి. అలా కనిపించని పాత్రలతో వచ్చిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) చావు కబురు చల్లగా :

పీటర్ అనే పాత్ర.. స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి భర్త పాత్ర కనిపించదు.

2) నువ్వు వస్తావని :

ఈ సినిమాలో హీరో నాగార్జున కు తల్లి ఉంటుంది. కానీ ఆ అమ్మ పాత్ర సినిమాలో కనిపించదు. పైగా ఆవిడ చనిపోయి హీరోయిన్ కు కళ్ళు దానం చేసినట్టు చూపిస్తారు.

3) ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు :

ఈ చిత్రంలో కూడా హీరో రవితేజ అమ్మ పాత్ర గురించి డిస్కషన్ ఉంటుంది. కానీ ఆ పాత్ర సినిమాలో కనిపించదు.

4) బొమ్మరిల్లు :

ఈ సూపర్ హిట్ మూవీలో హీరో సిద్దార్థ్ అక్క అయిన సురేఖ వాణి భర్త అమెరికాలో ఉన్నట్టు చెబుతారు.ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ బావ పాత్రను చూపించరు.

5) చంద్రలేఖ :

ఈ చిత్రంలో హీరోయిన్ రమ్యకృష్ణ.. రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుండీ వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. కానీ ఆ రాజ్ కుమార్ పాత్రను చూపించరు.

6) రౌడీ ఫెలో :

ఈ సినిమాలో కూడా హీరో నారా రోహిత్ కు తండ్రి పాత్ర ఉన్నట్టు డిస్కషన్ ఉంటుంది. కానీ అతని పాత్రను చూపించరు.

7) నానీస్ గ్యాంగ్ లీడర్ :

నాని హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కు ఓ వ్యక్తితో నిశ్చితార్ధం అయినట్టు డిస్కషన్ ఉంటుంది. కానీ ఆ వ్యక్తిని చూపించరు.

8) జాను :

ఈ సినిమాలో హీరోయిన్ సమంతకు పెళ్లై ఓ పాపకు తల్లి అయినట్టు చూపిస్తారు. కానీ ఈమె భర్త పాత్రను మాత్రం చూపించరు.

9) ఆర్.ఎక్స్.100 :

ఈ చిత్రంలో హీరోయిన్ పాయల్ హీరో కార్తికేయను మోసం చేసి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. కానీ ఆమె భర్త పాత్రను మాత్రం చూపించారు.

10) వకీల్ సాబ్ :

ఈ చిత్రంలో నివేదా థామస్ కు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు చెబుతుంది. కానీ అతన్ని చూపించరు. చివరికి వేరే అతనితో ఎంగేజ్మెంట్ అయినట్టు చూపిస్తారు. బహుశా అతనే బాయ్ ఫ్రెండ్ అనుకోవాలేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus