టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?

టాలీవుడ్ స్టార్ హీరోలు ఫిట్ గా కనిపించడం కోసం తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే తమ ఫేవరెట్ ఫుడ్ విషయంలో హీరోలు రూల్స్ ను పక్కన పెట్టేసి లొట్టలేసుకుంటూ తినేస్తారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేపల పులుసు, రొయ్యల వేపుడు ఎంతో ఇష్టంగా ఉంటారు. సీ ఫుడ్ తో పాటు చిరంజీవి దోశలు కూడా ఎంతో ఇష్టంగా తింటారని సమాచారం. గతేడాది బీ ది రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగంగా చిరంజీవి తనకు ఎంతో ఇష్టమైన దోశను వేసి తల్లికి ప్రేమతో దోశను తినిపించిన సంగతి తెలిసిందే.

నటసింహం నందమూరి బాలకృష్ణ రొయ్యలను ఎంతో ఇష్టంతో తింటారు. చికెన్ బిర్యానీని కూడా బాలయ్య ఇష్టపడతారని తెలుస్తోంది. బాలయ్య తో పాటు చాలామంది టాలీవుడ్ హీరోలకు బిర్యానీనే ఫేవరెట్ ఫుడ్ అని తెలుస్తోంది.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ నోస్టాలజిక్ కీమాను ఇష్టంగా తింటారు. వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకుని నోస్టాలజిక్ కీమాను తినడం వెంకటేష్ కు చాలా ఇష్టమని సమాచారం.

ఆరు పదుల వయస్సులో కూడా అందంగా కనిపించే నాగార్జున దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారని తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. సీ ఫుడ్, రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఎంతో ఇష్టంగా తింటారని సమాచారం.

మిల్కీ బాయ్ లా కనిపించే మహేష్ బాబు బిర్యానీ, చేపల పులుసును తెగ ఇష్టంగా తింటారు. అయితే మహేష్ ఇష్టమైన వంటకాలను కూడా డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటారని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వంటకాలు చాలానే ఉన్నాయి. పప్పు, లెమన్ రైస్ అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసుతో పాటు నెల్లూరు చేపల పులుసును పవన్ ఎంతో ఇష్టంగా తింటారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ యంగ్ హీరోకు నాన్నమ్మ చేసే వంటకాలు ఇష్టమని సమాచారం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో తనకు రోటీ, నాటుకోడి ఖీమా ఇష్టమని చెప్పారు. ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అమ్మ చేసే ఏ వంటకాన్నైనా ఇష్టపడతారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus