2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటం.. తరువాత ఓటిటి ల హవా మొదలవ్వడం జరిగింది. ఆ టైములో ‘అసలు థియేటర్లలో మనకి సినిమా చూసే యోగం ఉంటుందా?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ డిసెంబర్ చివర్లో వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం హిట్టు కొట్టి ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పడేలా చేసింది. ఆ తరువాత 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళే సాధించాయి. ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ ‘అల్లుడు అదుర్స్’ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ వంటి చిత్రాలు కూడా మంచి కలెక్షన్లు రాబట్టి పర్వాలేదు అనిపించాయి. దాంతో ఇక టాలీవుడ్ కోలుకున్నట్టే అని అంతా అనుకున్నారు.

కానీ కొన్ని సినిమాలు హిట్ టాక్ సంపాదించుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కపటదారి :

సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసాడు. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. సుమంత్ కెరీర్లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది.

2) చెక్ :

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదలయ్యి… పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.ఫైనల్ గా డిజాస్టర్ అయ్యింది.

3) అక్షర :

నందిత శ్వేత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ఆ వీకెండ్ తర్వాత థియేటర్లలో కనబడలేదు. ఫైనల్ గా ప్లాప్ గా మిగిలింది.

4) ఎ1 ఎక్స్ ప్రెస్ :

సందీప్ కిషన్ 25 వ చిత్రంగా వచ్చిన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ కు మొదటి రోజు హిట్ టాక్ లభించింది. డెన్నీస్ జీవన్ కొను కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 5న విడుదలయ్యి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

5) షాదీ ముబారక్ :

‘మొగలి రేకులు’ సాగర్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 5న విడుదలయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుంది. పద్మశ్రీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనల్ గా డిజాస్టర్ గా మిగిలింది.

6) శ్రీకారం :

శర్వానంద్ హీరోగా కిషోర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేక డిజాస్టర్ గా మిగిలింది.

7) రంగ్ దే :

నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న విడుదలయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ సాధించలేక యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

8) అరణ్య :

రానా హీరోగా ప్రభు సాల్మన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న విడుదలయ్యింది. పాజిటివ్ టాకే వచ్చింది కానీ బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఫైనల్ గా డిజాస్టర్ గా మిగిలింది.

9) వైల్డ్ డాగ్ :

నాగార్జున హీరోగా ఆషిషోర్ సాల్మన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలయ్యింది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేక డిజాస్టర్ గా మిగిలింది.

10) వకీల్ సాబ్ :

3 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రం ఇది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలయ్యింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది కానీ కరోనా సెకండ్ వేవ్ మరియు పొలిటికల్ ఇష్యూస్ కారణంగా టికెట్ రేట్లు తగ్గించడం వంటివి ఈ చిత్రాన్ని బ్రేక్ ఈవెన్ కాకుండా చేసాయి. ఫైనల్ గా ఈ చిత్రం అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus