Actress Pragathi: వాళ్లంతా నా కూతుళ్లు లాంటివాళ్లే: నటి ప్రగతి

సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా యుగం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎక్కువగా వినిపిస్తోంది కానీ… గతంలోనూ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని అంటుంటారు మన సీనియర్‌ నటీమణులు. అడపాదడపా ఆ రోజుల్లో తాము ఎదుర్కున్న సమస్యల గురించి చెబుతూ ఉంటారు. అలా తన తొలినాళ్లలో కాస్టింగ్‌ కౌచ్‌తో పడ్డ ఇబ్బందుల గురించి ఇటీవల వివరించారు ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి. తనదైన నటన, యాసతో ఆకట్టుకునే ప్రగతి ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లైంది. ఎన్నో కష్టనష్టాలు దాటుకొని నటిగా కొనసాగుతున్నారు.

మీ కెరీర్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనే మాట విన్నారా… మీకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అది ప్రగతిని అడిగితే… ఎందుకు లేదు. చాలామంది నుండి ఈ సమస్య ఎదురైంది అంటూ చెప్పుకొచ్చారు. తన కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా రోజంతా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడంటూ బాంబు పేల్చారు ప్రగతి. అయితే ఆ హీరో ఎవరు అనేది ఆమె చెప్పేలేదు. ఇండస్ట్రీలో కొందరు మహిళా నటులు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రగతి అన్నారట.

ప్రగతితో కలసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది అని చాలామంది నాయికలు చెబుతూ ఉంటారు. గతంలో ఒకటి రెండు సందర్భాల్లో పలువురు కథానాయికలు ఈ విషయం చెప్పుకొచ్చారు. ఆ మధ్య మెహరీన్‌ ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ… పని చేసే చోట స్నేహం అల్లుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది అని రాసుకొచ్చారు. సినిమాలో కూతురు కాస్తా నిజజీవితంలోనూ తన కూతురిలా మారింది అని చెప్పింది. అలా మెహరీన్‌ను బిడ్డగా భావిస్తున్నా అని చెప్పింది. ఈ ఇద్దరూ ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’లో కలసి నటించారు.

గతంలో తనతో నటించిన రెజీనా కూడా ఇలానే చెప్పుకొచ్చారు ప్రగతి. రెజీనా నా కూతురు లాంటిది, నన్ను రెజీనా అమ్మ అనే పిలుస్తుంది అని చెప్పుకొచ్చారామె. ఈ ఇద్దరూ సాయితేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటించారు. ఈ ఇద్దరే కాదు ఇలియానా కూడా ప్రగతికి మంచి ఫ్రెండ్‌ అట. ‘జల్సా’లో నటించినప్పటి నుండి మంచి స్నేహితులు అయిపోయారట. ఒక్కోసారి షూటింగ్‌లో ప్రగతి దగ్గరుండి ఇలియానాకు జడ వేసేవారట.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus