అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

ఈ మధ్య కాలంలో ఏ మిడ్ హీరో కూడా సాధించని రికార్డుని నాగ చైతన్య సొంతం చేసుకున్నాడు. అదేంటంటే బాక్సాఫీస్ వద్ద వరుసగా రూ.35కోట్లకి పైగా షేర్ ను కలెక్ట్ చేసిన సినిమాలకు గాను చైతన్య ఈ రికార్డుని దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ రికార్డుల గురించి చెప్పుకుంటే చైతన్యని మిడ్ రేంజ్ హీరోగానే చెప్పుకోవాల్సి వస్తుంది. చైతన్య స్టార్ అవ్వలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) నిజానికి చైతన్య ఓ స్టార్ ఫ్యామిలీ చెందిన హీరో. వాళ్ళ తాతగారు అక్కినేని నాగేశ్వర రావు గారు అప్పట్లో నెంబర్ 1 హీరోగా కొన్నాళ్ళు కొనసాగారు. రామారావు గారు ఎంట్రీ ఇచ్చాక నెంబర్ 2 ప్లేస్ లో నిలబడ్డారు.

2) ఇక నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సీనియర్ స్టార్ హీరో. చిరు, బాలయ్య తర్వాత నెంబర్ 3 ప్లేస్ ను దక్కించుకున్నారు. ఒక్కోసారి వరుస హిట్లిచ్చి టాప్ పొజిషన్లో కూడా కొనసాగారు.

3) మరి అలాంటి స్టార్ ఫ్యామిలీకి చెందిన నాగ చైతన్యని మిడ్ రేంజ్ హీరో అనే అంటున్నాం. అతని డెబ్యూ మూవీకి జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఆ చిత్రం కథ బాగుంది లోపంతా కథనం లోనే ఉంది. దానిని నెక్స్ట్ సినిమాకి సరిదిద్దుకుంటే సరిపోయేది. కానీ చైతన్య లవ్ స్టోరీల బాట పట్టాడు. అప్పటి నుండీ అక్కినేని హీరోలకి ఉన్న లాయల్ ఫ్యాన్స్ చైతన్యని పట్టించుకోవడం లేదు.

4) చైతన్య నటించిన గత 4 సినిమాలు హిట్లే. కానీ అతని ఇమేజ్ కానీ మార్కెట్ కానీ పెరగలేదు. స్టార్ హీరో అయ్యే కెపాసిటీ చైతన్యకి ఉంది. ఫైట్ లు బాగా చెయ్యగలడు, ‘లవ్ స్టోరీ’ లో డ్యాన్స్ కూడా చాలా బాగా చేసాడు. కానీ తన కంఫర్ట్ జోన్ నుండీ అతను పూర్తిగా బయటకి రావడం లేదు.

5) నాగ చైతన్య నటించే సినిమాల్లో హీరోయిన్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ‘మజిలీ’ లో సమంత, ‘100% లవ్’ లో తమన్నా, ‘లవ్ స్టోరీ’ లో సాయి పల్లవి.. ఇలా అతని హిట్ సినిమాల్లో చూసుకుంటే హీరోయిన్ల డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ‘బంగార్రాజు’ లో కృతి శెట్టి ఉంది.. ఆల్రెడీ ఆమెకి గోల్డెన్ లెగ్ అనే ఇమేజ్ ఉంది, పైగా ‘సోగ్గాడే’ కి సీక్వెల్ కాబట్టి.. ‘బంగార్రాజు’ హిట్ అయినా చైతన్యకి కలిసొచ్చింది ఏమీ లేదు.

6) స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులతో సినిమాలు చేసే అవకాశం వస్తే చైతన్య.. చాలా సందర్భాల్లో నొ చెప్పాడు. త్రివిక్రమ్, వినాయక్, అనిల్ రావిపూడి,బోయపాటి శ్రీను.. ఇలాంటి దర్శకులతో సినిమా చేసే అవకాశం వస్తే చైతన్య నొ చెప్పాడు.

7) మాస్ సినిమాలు చేసినా కొత్త దర్శకులతో చేస్తుంటాడు చైతన్య. ‘ఆటో నగర్ సూర్య’ ‘దడ’ ‘సవ్యసాచి’… ఇలాంటి సినిమాల నుండీ చై అభిమానులు భారీగా ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లకు వెళ్లారు. కానీ థియేటర్ల నుండీ ఉసూరుమంటూ తిరిగొచ్చారు.

8) అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. కానీ నాగ చైతన్య.. ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు.

9) మొహమాటం కొద్దీ.. సినిమాలు ఎక్కువ ఓకె చేస్తుంటాడు చైతన్య.. అనేది ఇండస్ట్రీ టాక్. ‘యుద్ధం శరణం’ ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి వాటిని అలాగే ఓకె చేసి బోర్లా పడ్డాడు.

10) మంచి క్రేజ్ ఉంది కాబట్టి… కొత్త దర్శకులతో సినిమాలు చేయడం తగ్గించాలి. కాంబినేషన్ పై క్రేజ్ లేకపోతే ఇప్పుడొచ్చే సినిమాల కి బిజినెస్ సరిగ్గా జరగడం లేదు. అలాగే జనాలు కూడా థియేటర్లకు రావడం లేదు. కాబట్టి.. డైరెక్టర్- ప్రొడ్యూసర్ ఇద్దరూ క్రేజ్ ఉన్నవాళ్లు అయ్యి ఉండాలి.

వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. చైతన్య నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి అతని మనసులో ఏముందో..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus