Pragya Jaiswal: కంచె బ్యూటీ.. బికినీలో హద్దులు దాటేసింది

Advertisement

ఒకప్పుడు హీరోయిన్ బికినీ వేసింది అంటే కుర్రాళ్ళు ఎగబడి సినిమాలకు వెళ్ళేవారు. ఇక అలాంటి పోస్టర్స్ వస్తే మ్యాగజైన్ పేపర్లు లక్షల్లో అమ్ముడుపోయేవి. అప్పట్లో బికినీకి అంటే కుర్రాళ్ళలో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే ఉండేది. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లుగానే ఆ బికినీ అంటే మాములే అన్నట్లు అయిపోయింది. దాదాపు 90% బ్యూటీలు బికినీలో ఎప్పుడో ఒకప్పుడు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. బికినీకి రోటీన్ అనే ట్యాగ్ వచ్చినప్పటికీ కొంతమంది భామలు అస్సలు బోర్ కొట్టించడం లేదు.

వల్గారిటీ లేకుండా అందంగా ప్రజెంట్ చేస్తున్నారు. అలాంటి బ్యూటీలలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ క్యూట్ నార్త్ పిల్ల ఎలాంటి స్టిల్ ఇచ్చినా ఇట్టే వైరల్ అవుతుంది. కంచె సినిమా నుంచి ఇండస్ట్రీలో కాస్త స్టార్ ఇమేజ్ ను అందుకుంటోంది. రీసెంట్ గా ఒక బికినీ లుక్ లో అమ్మడు సరికొత్తగా దర్శనమిచ్చింది. నెవర్ బిఫోర్ అనేలా హాట్ నెస్ డోస్ పెంచినట్లు అర్ధమయ్యింది. గతంలో కాస్త లిమిట్స్ లో కనిపించిన ప్రగ్యా మొదటిసారి హద్దులు దాటేసినట్లు తెలుస్తోంది.

ఇక ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని గ్లామర్ టచ్ ఎంత ఇచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయాలేమి దక్కలేదు. కొన్ని సినిమాలైతే దారుణంగా దెబ్బ కొట్టాయి. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ‘అఖండ’ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ ‘అంతిమ్’ సినిమా కూడా ఉంది. మరి ఆ రెండు సినిమాలతో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

1

2

3

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus