టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ఈ మధ్యనే పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన కూతురితో తీసుకున్న ఫొటోలను ఆమె షేర్ చేస్తూనే ఉంది. ‘పాప పుట్టినప్పటి నుండి అంతా కలగా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్( గర్భిణీ స్త్రీలకు వైద్యం చేసే డాక్టర్) అయిన తల్లి ఉండటం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. కానీ మానసికంగా అయితే ఆమెకు ఇది చాలా కష్ట సమయం.
డాక్టర్ సునీల్ ఈశ్వర్, మరియు అతని టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా ఎంతో కృషి చేశారు. అలాగే డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ ఆమె డెలివరీ టైంలో ప్రణీత ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. జూలై 28న అందరూ భీమన అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఆషాడ మాసంలో ఆఖరి రోజు ఈరోజు. అయితే ఈరోజుకి ఒక విశిష్టత కూడా ఉంది.
భీమన అమావాస్య రోజున భార్యలు తమ భర్తల పాదాలకు నమస్కరించి ఎప్పుడూ సౌభాగ్యాలతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీంతో ప్రణీత కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త నితిన్ రాజు పాదాలకు నమస్కరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కొందరు సూపర్ అంటూ కామెంట్లు చేస్తుంటే..! మరికొందరు మాత్రం.. డెలివరీ అయ్యి రెండు నెలలు కాకుండా ఇలా నెల మీద కూర్చోవడం ఎందుకు అంటూ మండిపడుతున్నారు. ఈ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :