గతేడాది కరోనా లాక్ డౌన్ టైం లో సోనూసూద్ తర్వాత మానవత్వం చాటుకున్న వారిలో ప్రణీత కూడా ఒకరు. కష్టకాలంలో ఎంతో మందిని ఆదరించి వారికి అన్నం పెట్టింది ప్రణీత. స్వయంగా ఆమెనే వంట చేసి మరీ అందరికీ అందజేసింది. బహుశా ఆ పుణ్యం వల్లనే అనుకుంట.. ఇక్కడ పెద్దగా అవకాశాలు లేని ప్రణీతకు ఏకంగా బాలీవుడ్లో అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం లభించింది. ఆ సినిమాలో నటిస్తున్న టైంలోనే అక్కడ మరో సినిమాలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.
దీంతో అక్కడైనా ప్రణీత కెరీర్ గాడిలో పడినందుకు అంతా సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. ప్రణీత బాలీవుడ్లో నటించిన రెండు సినిమాల పై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడినట్టు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రణీత బాలీవుడ్లో నటించిన రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కావడం లేదు. డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కాబోతున్నాయి. దీంతో ఆమె చాలా డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది.
‘భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ‘హంగామా 2’ చిత్రాలను త్వరలోనే ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ మధ్యనే విడుదలైన సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చినా.. కమర్షియల్ గా మంచి ఫలితాన్నే అందుకుంది. అందుకే ప్రణీత నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమాలు స్ట్రీమ్ కాబోతున్నాయి.