Pranitha Subhash: ఆ అరుపులు చాలా కాలం పాటు మనల్ని వెంటాడుతాయి!

తెలుగు తెరకు ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా పరిచయమైన నటి ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇలా తెలుగు కన్నడ హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రణీత పెళ్ళైన అనంతరం సినిమాలకు దూరమవ్వవడమే కాకుండా ప్రస్తుతం తల్లిగా ప్రమోట్ అయ్యి తల్లిగా బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఈ విధంగా ప్రణీత సినిమాలలో నటించకపోయినా నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.

గత కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ పండిట్ల హత్య గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఈమె పరోక్షంగా తనదైన శైలిలో సాయి పల్లవి మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఇకపోతే తాజాగా ఉదయపూర్ ఘటన పై ఈమె స్పందిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రణీత ఉదయపూర్ ఘటనపై స్పందిస్తూ… ‘హిందూ లైవ్స్‌ మ్యాటర్‌’ అనే పోస్టర్‌ని చేతుల్లో పట్టుకొని ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు.

ఈ పోస్టర్ నీ షేర్ చేయడమేకాకుండా ఎవరైనా వింటున్నారా? అని క్యాప్షన్ జోడించారు. ఈ క్రమంలోనే ప్రణీత ఈ ఘటన గురించి స్పందిస్తూ నేను ఆ వీడియో చూడకపోయి ఉంటే బాగుండేది.. బ్యాక్ గ్రౌండ్ లోని ఆ అరుపులు మన మనసులో ప్రతిధ్వనిస్తాయి. ఎక్కువ కాలం పాటు ఆ అరుపులు మనల్ని వెంటాడుతాయి అంటూ ప్రణీత ట్వీట్ చేశారు.

రాజస్థాన్లోని ఉదయపూర్ టైలర్ ను దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోని ఈ ఘటనపై పలువురు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు ఘటనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు. మీడియా వారు ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారని పేర్కొన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus