Prema: తన రెండో పెళ్ళి గురించి వస్తున్న వార్తల పై సీనియర్ హీరోయిన్ క్లారిటీ..

  • June 3, 2021 / 07:21 PM IST

సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..! వెంకటేష్- సురేష్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘ధర్మచక్రం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ అటు తర్వాత ‘కోరుకున్న ప్రియుడు’, ‘ఓంకారం’, ‘దేవి’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు తర్వాత ‘రాయలసీమ రామన్న చౌదరి’ ‘చిరునవ్వుతో’ ‘ఢీ’ వంటి చిత్రాల్లో స్పెషల్ రోల్స్ కూడా చేసింది. కొన్నాళ్ళ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గుతూ వస్తున్న టైం లో..

సినిమాలు తగ్గించి జీవన్ అప్పచ్చు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.2006 లో వీరి వివాహం జరిగింది. కానీ వీరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో 2016 లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈమె రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రేమకు ఆరోగ్యం బాగోలేని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా కథనాలు వినిపించాయి. ఈ విషయాల పై తాజాగా ప్రేమ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

‘దయచేసి వాటిని నమ్మొద్దు’ అని కూడా ఆమె విజ్ఞప్తి చేసింది.అంతేకాదు తను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు కూడా తెలియజేసింది. ఈమె క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈమె వయసు 44 ఏళ్ళు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి. చూడాలి వాటికి ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో..!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus