Actress Prema: హోమ్ టూర్..వీడియో తో హీరోయిన్ ప్రేమ వైరల్!

  • April 13, 2023 / 04:16 PM IST

ఈ మధ్య కాలంలో బుల్లితెర, వెండి తెర అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో హోమ్ టూర్ అంటూ హల్ చల్ చేస్తున్నారు. ఆ తరహాలోనే హీరోయిన్ ప్రేమ.. ఈ పేరు వినగానే అందరికీ దేవీ సినిమానే గుర్తొస్తుంది. నిజానికి ఈమె కన్నడ నటి హీరోయిన్ ప్రేమ అంటే అందరూ తెలుగు నటిగానే భావిస్తారు. ఆమె కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

హీరోయిన్ (Actress Prema) ప్రేమ.. ఈ పేరు వినగానే అందరికీ దేవీ సినిమానే గుర్తొస్తుంది. నిజానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం టాలీవుడ్ హీరోయిన్ గానే చూస్తారు. నటించిన రెండో చిత్రంతోనే ఉత్తమనటిగా కన్నడ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. 1995 నుంచి 2009 వరకు కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ తర్వాత కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన ప్రేమ..

మళ్లీ 2017లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2017, 2022లో రెండు చిత్రాల్లో నటించి కన్నడ ప్రేక్షకులను మరోసారి పలకరించారు. ఎంతోకాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంటున్న నటి ప్రేమని సుమన్ టీవీ పలకరించింది. బెంగళూరులో ఉంటున్న ప్రేమ హోమ్ టూర్‌ తో.. ఆమెను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ప్రస్తుతం ఆ హోమ్ టూర్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రేమ తన కుటుంబం, సోదరి, సోదరుడు అయ్యప్ప గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.

అంతేకాకుండా మళ్లీ ఎప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తారు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. “నాకు కూడా తెలుగులో మళ్లీ నటించాలని ఉంది. ఫోన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. కానీ.. ఒకటి, రెండ్రోజుల షూట్ ఉంది అని కాల్ చేస్తున్నారు. కమ్ బ్యాక్ ఇస్తే ఒక మంచి క్యారెక్టర్ తో ఇవ్వాలి అనుకుంటున్నా. ఒక మంచి క్యారెక్టర్ దొరికితే నటిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ హోమ్ టూర్ లో మరెన్నో ఆసక్తికర విషయాలను హీరోయిన్ ప్రేమ ప్రేక్షకులతో పంచుకున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus