Prema,Soundarya: సౌందర్య మృతిని తల్చుకుని ఎమోషనల్ అయిన హీరోయిన్ ప్రేమ!

  • April 14, 2023 / 02:39 PM IST

అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. పేరుకు కన్నడ హీరోయిన్ అయినా కూడా.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించేవారు. ఆవిడ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ప్రేమ వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత సుమన్ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. కన్నడ స్టార్ హీరోయిన్ ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీల్లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి మెప్పించారు.

కానీ, 2010 నుంచి వెండితెరకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 2017, 2022లో మాత్రం రెండు చిత్రాల్లో నటించారు. అలనాటి స్టార్‌ హీరోయిన్ ప్రేమను ఆ ఛానల్ బెంగళూరులో ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వూలో వ్యక్తిగత జీవితం, కుటుంబం, సినిమా కెరీర్ గురించి ప్రేమ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తెలుగు ప్రేక్షకులపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోతే టాలీవుడ్ లో అంత గొప్ప నటిని కాలేకపోయాను అంటూ కామెంట్‌ చేశారు.

ఇంటర్వ్యూలో సహనటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి కూడా ప్రేమ (Prema) స్పందించారు. సౌందర్యతో కలిసి నటించిన ఆ రోజులను మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆమె గురించి మాట్లాడుతూ ప్రేమ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సౌందర్య చనిపోయిన రోజు గురించి గుర్తుచేసుకున్నారు. “సౌందర్య చనిపోయిన రోజు.. ఇంతేనా జీవితం అనిపించింది. ఇంటికి వెళ్లగానే ఎదురుగా సౌందర్య ఫొటోలు పెట్టారు. అవి చూడాగానే నాకు ఏదోలా అయిపోయింది. సౌందర్య బాడీని బాక్స్ లో పెట్టి ఉంచారు.

చూడటానికి ఫేస్ కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, హార్డ్ వర్క్ తప్ప ఏమీ లేదని ఎమోషనల్ అయ్యారు. ఆరోజు సౌందర్య అమ్మగారితో మాట్లాడను. ఆవిడ సాధారణంగా ఎవరితో మాట్లాడేవారు. ఆరోజు ఆవిడ ఎంతో ఏడ్చారు. సౌందర్యతో నటించే రోజులు చాలా బాగుండేవి. సౌందర్య చాలా తక్కువ తినేది. పప్పు, పాలక్‌, నెయ్యి, గోగూర పచ్చడి అవన్నీ తినడం సౌందర్య దగ్గరే నేర్చుకున్నాను.

నేను అయితే షాట్ ఎప్పుడు అయిపోతుందా అంటూ ఎదురుచూసేదాన్ని. కానీ, సౌందర్య మాత్రం ప్రతి షాట్ లో అందంగా కనపడాలి అని అనుకునేది. ఎప్పటికప్పుడు టచప్ చేసుకోవడం, ముఖం అందంగా ఉండేలా చూసుకోవడం చేసేది. ఇప్పుడు మాట్లాడుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి” అంటూ ప్రేమ ఎమోషనల్ అయ్యారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus