మామిళ్ళ శైలజ ప్రియా (Priya) అలియాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా అంటే తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరేమో అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినిమాల్లో తల్లీ,అత్త, పిన్ని వంటి పాత్రలతో మెప్పించిన ఈమె ‘బిగ్ బాస్5’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ‘కృష్ణ ముకుంద మురారి’ వంటి సీరియల్స్ లో కూడా ఈమె నటిస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రియాకి బాగా క్రేజ్ ఎక్కువ.
ఇప్పటి కుర్ర హీరోయిన్లకి పోటీగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటి కుర్రకారులో కూడా ఈమె అందాన్ని అభిమానించేవారు ఉన్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు.పైగా ఆమె వయసు 42 ఏళ్ళు అంటే నమ్మడం కూడా కొంచెం కష్టం అని అంతా అంటుంటారు. వీటి వల్లే సీనియర్ నటీమణుల్లో ప్రియా చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ప్రియా ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఆమె ఏ ఫోటో షేర్ చేసినా వెంటనే అవుతూ ఉంటుంది. అలాగే వాటికి లైకుల వర్షం కురుస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రియా వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలీదు. ఆమె సింగిల్ మథర్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. అలాగే ఈమెకు చెట్టంత కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు నిశ్చయ్. ఇతను చాలా హైట్ గా ఉన్నాడు. ‘హీరో కటౌట్’ అని చెప్పినా అతిశయోక్తి అనిపించుకోదు.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?