Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. మే 13 న ఎలక్షన్స్ అంటూ డేట్ కూడా ప్రకటించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అయితే తన జనసేన పార్టీ తరఫున ప్రచారం గట్టిగా చేస్తున్నారు. ఎండలని లెక్క చేయకుండా జనాలని కలవడానికి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇలాంటి టైంలో అతనికి, అభిమానులకి, జనసైనికులకి బూస్టప్ ఇచ్చేనందుకు రెడీ అయ్యింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) యూనిట్. ఇందులో భాగంగా.. ” ‘ అంటూ మరో గ్లింప్స్ ని వదిలింది.

1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ ” ‘ యాక్షన్ మోడ్లో మొదలైంది. ఆ తర్వాత విలన్ గ్యాంగ్లోని మనిషి ‘నీ రేంజ్ ఇది’ అంటూ టీ గ్లాస్ ను చూపించి కింద పడేయడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది’ ‘గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం అందరికీ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన బీజీయం కూడా సూపర్ గా ఉంది.

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar), పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఎలెక్షన్స్ వల్ల షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అయినా సినిమా ఆగిపోలేదు. ఎలక్షన్స్ తర్వాత షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది. సరే ఇక ” ‘ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus