Vijay: విజయ్ కారు ధ్వంసం.. కారణం?

‘ఆవేశాన్ని ఆపొచ్చు కానీ అభిమానాన్ని ఆపలేం’ అని ‘మిరపకాయ్’ (Mirapakay) సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) ఓ డైలాగ్ రాశాడు. అది నిజం అని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. కాదు కాదు ఎప్పటికప్పుడు నిజం అని ప్రూవ్ అవుతూనే ఉంది. ఇక విషయంలోకి వెళితే.. తమిళ స్టార్ హీరో విజయ్ కి (Vijay Thalapathy) అభిమానుల సంఖ్య బాగా ఎక్కువ. ఓ రకంగా తమిళంలో అతను నెంబర్ 1 హీరో. పైగా అతను సినిమాలకి గుడ్ బై చెప్పి.. పూర్తిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.

అందుకే సైన్ చేసిన సినిమాలు కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ షూటింగ్ నిమిత్తం కేరళకి వెళ్లాల్సి వచ్చింది.అయితే అక్కడ అతనికి ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురైంది. ‘చెన్నై నుండి తిరువనంతపురం వస్తున్నాడు విజయ్’ అని అక్కడి అభిమానులకి తెలిసింది. అంతే ఇక.. వాళ్ళ అభిమానం ముందు సెక్యూరిటీ ఫోర్స్ కూడా నిలబడలేకపోయింది.

ఏదో ఒక రకంగా తమ అభిమాన హీరో అని చూసేయాలి.. అదే మెయిన్ ఎజెండాగా భావించి.. విజయ్ ప్రయాణిస్తున్న కారును వారు వెంబడించారు. బైకుల మీద వందల సంఖ్యలో వచ్చిన అభిమానులు.. విజయ్‌ కారు పై దూకేశారు. దీంతో ఆ కారు అద్దాలు పగిలిపోయాయి. ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. విజయ్ కారులో ఉన్నాడు అని కూడా చూడకుండా.. వాళ్ళు తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు అభిమానులు. అయినా విజయ్ వారిపై కోపం చూపలేదు. వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus