Om Bheem Bush Censor Review: హీరో శ్రీవిష్ణు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీవిష్ణుకు నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ఈ నెల 22వ తేదీన శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి(Priyadarshi)  , రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ, ఎమోషన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని కడుపుబ్బా ప్రేక్షకులను నవ్వించేలా ఈ సినిమా ఉందని సమాచారం అందుతోంది.

సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని భోగట్టా. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులు ఉంటాయని ఆ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులను కచ్చితంగా ఈ సినిమా మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

శ్రీవిష్ణు గతేడాది సామజవరగమన (Samajavaragamana) సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారు. శ్రీవిష్ణును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఓం భీమ్ బుష్ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఓం భీమ్ బుష్ మూవీ పుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కడం గమనార్హం.

ఈ సినిమా మరో జాతిరత్నాలు (Jathi Ratnalu) రేంజ్ మూవీ అవుతుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. శ్రీవిష్ణు వరుస విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న శ్రీవిష్ణు అభిమానులను అంతకంతకూ పెంచుకుంటున్నారు. శ్రీవిష్ణు క్లాస్ సినిమాలతో అదిరిపోయే హిట్లను అందుకుంటున్నారు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఓం భీమ్ బుష్ విడుదలవుతోంది. ఈ వారం థియేటర్లలో పెద్దగా పోటీ లేకపోవడం శ్రీవిష్ణు మూవీకి మరింత కలిసొస్తుందని చెప్పవచ్చు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus