‘ఎవరే అతగాడు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ప్రియమణి. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు కాబట్టి ఈ విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. తరువాత ఈమె జగపతి బాబు సరసన నటించిన ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకు క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత ఏకంగా రాజమౌళి- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘యమదొంగ’ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు స్టార్ స్టేటస్ ఏర్పడింది.
తరువాత ‘నవ వసంతం’ ‘హరే రామ్’ ‘ద్రోణ’ ‘మిత్రుడు’ ‘శంభో శివ శంభో’ ‘గోలీమార్’ ‘రగడ’ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. కానీ తరువాత కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు సహజంగానే అవకాశాలు తగ్గాయి. దీంతో తమిళ, కన్నడ ఇండస్ట్రీల వైపు మళ్ళింది. అలా అని ఈమెకు అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం ‘విరాట పర్వం’ ‘నారప్ప’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే బుల్లితెర పై కూడా పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా.. గత 2,3 రోజులుగా ఈమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రకారు ఈ ఫోటోలకు ఆకర్షించ పడుతున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :