Priyamani: అతను నా లక్కీ ఛార్మ్ అంటున్న ప్రియమణి..?
- June 14, 2021 / 11:03 AM ISTByFilmy Focus
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు సినిమా ఆఫర్లు తగ్గుతాయి. అయితే ప్రియమణికి మాత్రం భిన్నంగా ఆఫర్లు పెరుగుతున్నాయి. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ప్రియమణి ఢీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రియమణి తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్2 లో తన పాత్రకు మంచి ప్రాధాన్యత లభించిందని ఆమె అన్నారు.
సమంత చేసిన రాజీ పాత్ర చాలా కష్టమైన పాత్ర అని ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం గురించి స్పందించాలని తాను అనుకోవడం లేదని ప్రియమణి చెప్పుకొచ్చారు. గతంలో వెంకటేష్ సార్ తో కలిసి నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల నటించలేకపోయానని నారప్ప సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నానని ఈ సినిమాలో తాను అనంతపురం యాసలో మాట్లాడతానని ప్రియమణి వెల్లడించారు. తాను 99 శాతం డైరెక్టర్స్ యాక్టర్ నని డైరెక్టర్లు ఏం చెబితే అది చేస్తానని ప్రియమణి వెల్లడించారు.

తాను, విద్యాబాలన్ కజిన్స్ అని విద్యాబాలన్ నటనను చూస్తే తనకు గర్వంగా అనిపిస్తుందని ప్రియమణి చెప్పుకొచ్చారు. తనకు సపోర్ట్ చేసే భర్త దొరికారని అతను నా లక్కీ చార్మ్ అని ప్రియమణి చెప్పారు. భర్తతో అప్పుడప్పుడూ చిన్నచిన్నగొడవలు జరుగుతాయని ఆ సమయంలో భర్తనే తగ్గుతాడని ప్రియమణి వెల్లడించారు. కరోనా సమయంలో పారితోషికం కొంచెం తగ్గించానని ప్రియమణి చెప్పుకొచ్చారు. నారప్ప, విరాటపర్వం సినిమాలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ చేశామని ప్రియమణి తెలిపారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!











